టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈడీ విచారణలో ఇప్పటివరకు దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ విచారణకు హాజరయ్యారు. అయితే తాజాగా ఈరోజు నందు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైయ్యారు. నందు ఈనెల 20న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఈడీ అధికారుల అనుమతితో నేడు విచారణకు హాజరయ్యాడు.
కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ఈడీ ప్రశ్నిస్తుంది. ఎక్సైజ్ పోలీసులు ముందు నందు విచారణ జరుగుతోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారం, కెల్విన్ మొబైల్ లోని కాంటెక్ట్ ఆధారంగా నందుకు ఈడీ సమన్లు ఇచ్చింది. మీడియా కళ్ళు గప్పి నందు విచారణకు హాజరైయ్యారు. బ్యాంక్ లావాదేవీలుపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కెల్విన్ పరిచయాలు, డ్రగ్స్ కొనుగోలుపై ఎక్సైజ్ శాఖ ఇచ్చిన రిపోర్ట్ లో నందు పేరు వున్న విషయం తెలిసిందే. సాయంత్రం వరకు నందును ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.
