పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..రాజీవ్ హైవే పై వేగంగా వెళుతున్న బైక్ ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్న ఇద్దరు రోడ్డుపై పడిపోగా వెనకనుండి వచ్చిన లారీ ఒకరిపైనుండి దూసుకెళ్లింది.. దీంతో ఆ వ్యక్తి తల లారీ కిందపడి నుజ్జు నుజ్జు అయ్యింది.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలు అయ్యాయి..
వివరాల్లోకి వెళితే..పాలకుర్తి మండలం కొత్తపల్లికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ రామస్వామి మరోవ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వేగంగా వెళుతున్న బైక్ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్న ఆర్ఎంపితో పాటు మరో వ్యక్తి రోడ్డుపై పడిపోయారు.. హైవే కావడంతో వాహనాలు వేగంగా వస్తున్నాయి.. అయితే వెనుక వచ్చిన లారీ రామస్వామి తల పై నుంచి వెళ్ళింది. దాంతో అతను స్పాట్ లోనే ప్రాణాలను కోల్పోయాడు..
ఈ ప్రమాదం పై పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు..గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఆర్ఎంపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా బైక్ తో పాటు ఆటోను పక్కకు తీశారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..