Horseshoe Crab: 45 కోట్ల ఏళ్లుగా భూమిపై జీవి.. 1 లీటర్ రక్తం ధర రూ.12.58 లక్షలు!
- ప్రపంచంలోనే ఓ జీవి రక్తానికి అత్యధిక ధర
- దాని పేరు "హార్స్ షూ క్రాబ్"
- 1 లీటర్ రక్తం ధర రూ.12.58 లక్షలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే ఓ జీవి రక్తానికి అత్యధిక ధర పలుకుతుంది. దాని పేరు “హార్స్ షూ క్రాబ్”. ఈ ప్రత్యేకమైన పీత రక్తం ప్రత్యేక రంగులో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని రక్తం వైద్యరంగంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ధర లక్షల్లో ఉంటుంది. వాస్తవానికి.. ఈ రక్తంలో ఒక ప్రత్యేక మూలకం కనుగొనబడింది. ఇది మందులు, ఇంజెక్షన్లలో బ్యాక్టీరియాను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. హార్స్‌షూ పీతలు వాటి గుర్రపుడెక్క లాంటి ఆకారం నుంచి పేరు పొందాయి. ఇది డైనోసార్ల కంటే పాత జీవిగా చెబుతారు. ఇది దాదాపు 45 కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఉంది. దాని రక్తం యొక్క రంగు నీలం. కారణం హిమోసైనిన్ అనే శ్వాసకోశ వర్ణద్రవ్యం ఇందులో ఉంటుంది. ఈ వర్ణద్రవ్యం రాగిని కలిగి ఉంది. ఒక లీటర్ గుర్రపుడెక్క పీత రక్తం ధర దాదాపు 15 వేల డాలర్లు అంటే దాదాపు 12 లక్షల 58 వేల రూపాయలు పలుకుతుందట.
READ MORE: Palla Srinivas: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..!
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
- Jaishankar-Rubio: హార్ముజ్‌లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్‌కు రూబియో సూచన
- Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
రక్తం నుంచి బ్యాక్టీరియా ..
గుర్రపుడెక్క పీతల రక్తంలో అతి సూక్ష్మమైన బ్యాక్టీరియాను కూడా గుర్తించవచ్చని 1960లలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పటి నుంచి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, శస్త్రచికిత్సా పరికరాలను క్రిమిరహితం చేయడానికి ఉపయోగిస్తున్నాయి. ప్రతి పీత నుంచి దాదాపు 30% రక్తం సంగ్రహించబడుతుందట. ఒక నివేదిక ప్రకారం.. వైద్య అవసరాల కోసం ప్రతి సంవత్సరం 60 లక్షల గుర్రపుడెక్క పీతలు పట్టుబడుతున్నాయి. రక్త తీస్తుండగా.. దాదాపు 30 శాతం పీతలు చనిపోతాయట. మిగిలిన పీతలను తిరిగి సముద్రంలోకి వదిలేస్తారు. అయితే అవి పూర్తిగా కోలుకుంటాయో లేదో ఎవరికీ తెలియదు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) అమెరికన్ హార్స్‌షూ పీతను 2016లో దాని రెడ్ లిస్ట్‌లో ‘హార్స్‌షూ’ విభాగంలో ఉంచింది. త్వరలో ఇది అంతమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!