సీఎం కేసీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతూ రైతులకు భ్రమ కలిపిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలు మార్చాలని సూచిస్తుంటే.. ఇక్కడ రాష్రంలో బండి సంజయ్ రైతులను వరి పంట వేయమని చెప్పడం కరెక్టు కాదన్నారు. ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే.. సిల్లీ బీజేపీ వేయమంటోంది అంటూ ఎద్దేవా చేశారు.
బండి ఇక్కనైన తన తీరు మార్చుకోవాలని.. లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా హుజురాబాద్ ఫలితంపై కూడా స్పందించిన కేసీఆర్.. పార్టీ అన్నాక గెలుపోటములు సహజం అని వ్యాఖ్యానించారు.