జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. పూంచ్ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వివరణ ఇచ్చారు. ఆర్మీ వాహనం పూంచ్ జిల్లాలోని భింబర్ గలి నుంచి సాంగ్యోట్‌కు తరలిస్తుండగా గుర్తు తెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని రక్షణ అధికారులు తెలిపారు. భింబర్ గలి ప్రాంతానికి సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపారని, గ్రెనేడ్ దాడి కారణంగా మంటలు చెలరేగాయని ఆర్మీ తెలిపింది. ఈ ఘటనలో గాయపడిన మరో ఆర్మీ సిబ్బందిని వెంటనే రాజౌరీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read:Gudivada Hot Politics Live:పవన్ పై కొడాలి నాని విమర్శల ప్రభావం ఉంటుందా?
భారీ వర్షాలు, వెలుతురు సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న ఉగ్రవాదులు భారత సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్లతో మెరుపుదాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు గ్రెనేడ్‌లను వినియోగించడం వల్ల వాహనంలో మంటలు చెలరేగాయి అధికారులు తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు మరణించారని ఆర్మీ తెలిపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మరో సైనికుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం మోహరించారు.
మరోవైపు, జైష్ మద్దతుతో కూడిన ఉగ్రవాద సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పిఎఎఫ్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. ఆర్మీ వాహనంపై 50 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఐదుగురు ఆర్మీ జవాన్ల మృతికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలిపారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దాడిని ఖండించారు. విధి నిర్వహణలో ఐదుగురు ఆర్మీ జవాన్ల ప్రాణాలను బలిగొన్న పూంచ్‌లో జరిగిన ఉగ్రదాడి భయంకరమైన వార్త అని ఆయన ట్వీట్ చేశారు.
Also Read:Gudivada Hot Politics Live:పవన్ పై కొడాలి నాని విమర్శల ప్రభావం ఉంటుందా?
కాగా, మేలో శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఉగ్రదాడి జరిగింది. వచ్చే నెలలో గోవాలో జరిగే షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశానికి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు వస్తారని పాకిస్థాన్ ప్రకటించిన రోజే ఈ ఉగ్రదాడి జరిగింది.