జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వివరణ ఇచ్చారు.