మారకపోతే వాళ్లకే నష్టం.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్..
ఎమ్మెల్యే లు మారకపోతే వారికే నష్టం.. అంటూ మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో.. ఎమ్మెల్యేలకు కఠినమైన హెచ్చరికలు ఇచ్చారు చంద్రబాబు.. ఎమ్మెల్యేలు మారకపోతే వారికి నష్టం మాత్రమే వస్తుందని, తన వ్యక్తిగత విధానంలో ఎట్టి పరిస్థితుల్లో నిక్కచ్చిగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. 9 ప్యారామీటర్లలో సర్వే చేయించి, ఫలితాలను సీల్డ్ కవర్‌లో ఎమ్మెల్యేలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక, లోకేష్ తన పని తాను చేస్తున్నారు, నేను నా పని చేస్తున్నా. నేతలతో సంబంధాలు, మోటివేషన్ భయ-భక్తీ లాగా ఉండాలి. మంగళగిరి చీరలకు మహిళా ఎమ్మెల్యేలు ఒకే రకమైన చీరలు ధరించడం ఐక్యతకు ఉదాహరణ అని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధిపై చర్చలో, బిల్ గేట్స్‌ను మూడు సార్లు ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు చంద్రబాబు.. హైటెక్ సిటీ, విశాఖ అగ్రిటెక్ ప్రాజెక్ట్, సంజీవిని పథకం కోసం బిల్ గేట్స్ తరలింపులు నిర్వహించబడినట్లు వివరించారు. ఇక, జూబ్లీహిల్స్‌లోని వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్న ఆయన… 1982లో అక్కడ అడవిలా ఉన్న భూమిలో ఇల్లు నిర్మించడానికి వెళ్లిన అనుభవం, తర్వాత బాలకృష్ణకు ఇల్లు కట్టించి ఇచ్చిన విధానం, నాలుగేళ్లలో పరిసర ప్రాంతాల పరిస్థితులు మారిన ఉదాహరణ ద్వారా అమరావతి అభివృద్ధిలోనూ ఇలాంటి గణనీయ మార్పులు సాధించబడతాయని తెలిపారు.
శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
మహా శివరాత్రి ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం రోజు వచ్చింది.. అయితే, ఆదివారం శివరాత్రి జాగారంలో భక్తులు ఉండడంతో.. మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆప్షనల్ హాలీడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలీడేగా పరిగణించాలని అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. మహాశివరాత్రి అనంతరం విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై AP JAC Amaravati నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎపీజేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రోజున ఆప్షనల్ హాలీడే ఇవ్వడం వల్ల ఉద్యోగులు పండుగను ప్రశాంతంగా జరుపుకునే అవకాశం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.
పెర్ఫామెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్.. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు..
ఏపీ బడ్జెట్ 2026-27పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కూటమి ప్రభుత్వ పనితీరు “పెర్ఫామెన్స్ వీక్, పబ్లిసిటీ పీక్” అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. బడ్జెట్ పుస్తకంలో బొమ్మలు తప్ప అసలు ఆదాయాలు, ఖర్చుల స్పష్టమైన వివరాలు లేవని ఆరోపించారు. ఇప్పటికే రూ.3.12 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, కానీ రాష్ట్ర మొత్తం అప్పులపై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం పెద్ద నేరమని, బడ్జెట్‌లో చెప్పిన అనేక అంశాలు ఊహాగానాలేనని విమర్శించారు. రూ.90 వేల కోట్లకంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి లేకపోయినా, 60 శాతం పెరిగినట్టు అంచనాలు చూపిస్తున్నారని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు ఎంత నిధులు కేటాయించారో వెల్లడించలేదని ప్రశ్నించారు బుగ్గన.. తమ హయాంలో గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, నాడు-నేడు కింద పాఠశాలలు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, పోర్టులు నిర్మించామని గుర్తుచేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులకు పలు పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
ఇది ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్..
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27 వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. అయితే, ఈ బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. కూటమి పార్టీలు బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం.. విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఏపీ బడ్జెట్ 2026-27పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. 2026-27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలు నెరవేర్చేలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ప్రజా ఆకాంక్షలను తీరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారని యనమల అన్నారు. రుణాల నియంత్రణకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉందని తెలిపారు. ఇక, రుణాల రీ-షెడ్యూలింగ్, వడ్డీ భారాన్ని తగ్గించే చర్యలు రాష్ట్రాన్ని అప్పుల భారంనుంచి బయటపడేయడానికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు యనమల.. అలాగే బడ్జెట్‌లో పరిశ్రమలు, పెట్టుబడులు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం సానుకూల పరిణామమని చెప్పారు. సామాజిక న్యాయం దిశగా బడ్జెట్ రూపొందించడం కూడా అభినందనీయమని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు..
శివరాత్రికి ముస్తాబైన ప్రముఖ శైవ క్షేత్రాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచారామ క్షేత్రాలతో పాటు ప్రముఖ శైవ ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా కోటప్పకొండ, అమరావతి, దైద క్వారీ , గోవాడ వంటి క్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం అధికారులు ముందెన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఏర్పాట్లు చేపట్టారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వెలసిన త్రికోటేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ ఏడాది శివరాత్రికి సుమారు 3 నుండి 5 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోటప్పకొండ ప్రత్యేకత అయిన విద్యుత్ ప్రభలు ఇప్పటికే వివిధ గ్రామాల నుండి కొండకు చేరుకుంటుండటంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. అయితే శివరాత్రికి ముందే, అంటే శనివారం మధ్యాహ్నం నుండే భక్తుల తాకిడి ఊహించని విధంగా పెరగడంతో కొండకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో పూర్తిగా నిండిపోయాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కోటప్పకొండ పైకి ప్రైవేట్ వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. భక్తులు తమ సొంత వాహనాలను కొండ కింద కేటాయించిన నిర్ణీత పార్కింగ్ స్థలాల్లోనే ఉంచాల్సి ఉంటుంది. అక్కడ నుండి భక్తులను కొండపైకి చేరవేసేందుకు ఆర్టీసీ అధికారులు సుమారు 120 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. భక్తులు కేవలం ఈ ప్రభుత్వ బస్సుల ద్వారా మాత్రమే కొండపైకి చేరుకునేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
మాట నిలబెట్టుకున్న జగ్గారెడ్డి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి , సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం, జగ్గారెడ్డి తాను అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం చైర్మన్ , వైస్ చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. జగ్గారెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్‌గా షేక్ షఫీ ఎంపికయ్యారు. సదాశివపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్‌గా రేణుక చిరును ఫైనల్ చేశారు. వీరంతా ఈ నెల 16వ తేదీన (ఎల్లుండి) అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ 22 వార్డులను కైవసం చేసుకుంది. అలాగే సదాశివపేటలోని 26 వార్డులలో 16 స్థానాలను గెలుచుకొని తిరుగులేని పట్టు సాధించింది. ఎన్నికల ప్రచారంలో భాగం
హైవేపై ప్రధాని మోడీ చారిత్రాత్మక ల్యాండింగ్.. ఎందుకింత ప్రత్యేకం..
ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న విమానం అస్సాంలోని మోరాన్‌లోని హైవేపై ల్యాండ్ అయింది. ఇది చారిత్రాత్మక ల్యాండింగ్‌గా నిలిచింది. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ELF) వద్ద విమానం ల్యాండ్ అయింది. ఇది దేశ వ్యూహాత్మక, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. అత్యవసర సమయాల్లో భారత వైమానిక దళ యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండ్ అయ్యేల ఈ నేషనల్ హైవేని అభివృద్ధి చేశారు. శనివారం ఈ రన్‌వేను ప్రధాని మోడీ ప్రారంభించారు. చైనాకు సమీపంలో ఉండే ఈ రన్ వే చాలా కీలకంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌ను రూ. 100 కోట్లతో నిర్మించారు. ఇది సైనిక, పౌర వినియోగాల కోసం దిబ్రూగఢ్ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. మోడీ ప్రయాణిస్తున్న C-130J విమానం చాబువా ఎయిర్‌ఫీల్డ్ నుంచి ELFకు చేరుకుంది. ఇక్కడ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 40 నిమిషాల వైమానిక ప్రదర్శన చేసింది. ఈ ఎయిర్ షోలో సుఖోయ్ Su-30MKI, రాఫెల్ ఫైటర్ జెట్లు, An-32 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, ALH హెలికాప్టర్లు , గరుడ కమాండోలు పాల్గొన్నారు. ఈ రన్ వే 40 టన్నుల వరకు ఫైటర్ జెట్లు, 74 టన్నుల వరకు ట్రాన్స్‌పోర్ట్ విమానాల నిర్వహణకు అనుకూలంగా ఉంది.
‘‘భారత్‌కు శివరాత్రి, పాక్‌కు కాళరాత్రి’’.. మళ్లీ రేపు ఇదే రిపీట్ కావాలి..
23 ఏళ్ల క్రితం సచిన్ పాకిస్తాన్‌పై ఆడిన ‘‘శివ తాండవం’’ వరల్డ్ క్రికెట్‌లోనే ఒక మరుపురాని ఇన్నింగ్స్ అయింది. ఇప్పుడున్న జెన్ జీ తరానికి ఈ మ్యాచ్ గురించి పెద్దగా తెలిసి ఉండదు, కానీ 90వ తరానికి మాత్రం ఈ మ్యాచ్ ద్వారానే క్రికెట్ పరిచయమైందంటే అతిశయోక్తి కాదు. మార్చి 1, 2003 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఈ ఇన్నింగ్స్‌ను ఎవరూ మరిచిపోరు. వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్ వంటి నిప్పులు చెరిగే బాల్స్, సచిన్ ముందు చిన్నబోయాయి. శివరాత్రి రోజు పాకిస్తాన్‌ను బౌలర్లను సచిన్ టెండూల్కర్ చీల్చి చెండాడారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా సచిన్‌కు సెహ్వాగ్ జతకట్టి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 23 ఏళ్ల తర్వాత మరోసారి శివరాత్రి రోజే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఫిబ్రవరి 15 ఆదివారం కొలంబో వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఇది కూడా ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ కావడం విశేషం. కానీ అప్పుడు వన్డే అయితే, ఇప్పుడు టీ20. ఈ శివరాత్రి కూడా ‘‘భారత్‌కు శివరాత్రి, పాక్‌కు కాళరాత్రి’’ కావాలని యావత్ భారత్ కోరుకుంటోంది. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. గ్రూప్ ఏలో తిరుగులేని విజయాలతో ఆస్ట్రేలియా మొదటిస్థానంలో ఉండగా.. తరువాతి రౌండ్ క్వాలిఫైయింగ్ బెర్త్ కోసం భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మధ్యలో మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత్ ముందు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పాక్ ఓపెనర్ సయీద్ అన్వర్ 126 బాల్స్ లో 101 పరుగులు చేసి భారీ స్కోరుకు కారణం అయ్యాడు. అయితే అప్పటి వరకు భారత్ కు 222 కంటె ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఎన్నడూ కూడా విజయవంతంగా ఛేదించలేకపోయిన భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
అభిషేక్ శర్మ ఆడాలని పాక్ కోరుకుంటే, అలానే కానివ్వండి..
అనారోగ్య కారణాల వల్ల భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, పాకిస్తాన్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా.? లేదా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 15న ఆదివారం కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్‌కు ముందు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అభిషేక్ శర్మ ఆడటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ కెప్టెన్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ..‘‘అభిషేక్ శర్మ ఆడాలని పాకిస్తాన్ కోరుకుంటే, అతను ఆడుతాడు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ తో మ్యాచ్‌కు ముందు భారత జట్టు అభిషేక్ శర్మ ఆడటంపై నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ ఆస్పత్రిలో చేరారు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే, అభిషేక్ శర్మ గురించి పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అతను గుడ్ ప్లేయర్ అని అందరికి తెలుసు. అతను రేపు ఆడాలని ఆశిస్తున్నాను. మేము వారి ఉత్తమ జట్టుతో ఆడాలని కోరుకుంటున్నాము. అతను కోలుకుంటున్నాడని, రేపు ఆడగలడని ఆశిస్తున్నాను’’ అన్నారు.
‘ధురంధర్’లో విలన్ పాత్రపై నాగార్జున క్లారిటీ!
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన తన 100వ సినిమా ‘#King100’పై దృష్టి సారించారు. ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. నాగ్ కేవలం హీరోగానే కాకుండా, ప్రత్యేక పాత్రల్లోనూ అలరిస్తు్న్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘కూలీ’ సినిమాలో ఆయన విలన్‌గా అదరగొట్టారు. ఈక్రమంలో సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలుసా.. ‘ధురంధర్’ రెహమాన్ డెకాయిత్ పాత్రలో నాగ్ కనిపించాల్సిందని, ఆయన ఈ పాత్రను వదులుకున్నారంటూ తెగ ప్రచారం అవుతుంది. దీనిపై తాజాగా నాగ్ స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తనకు ఎవరూ ఏ పాత్ర చేయమని అడగలేదని చెప్పారు. ఇదే క్రమంలో ఆయన ‘ధురంధర్’ మూవీ గురించి మాట్లాడుతూ..‘ధురంధర్’లో అక్షయ్‌ఖన్నా యాక్టింగ్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని, ఓవరాల్‌గా ఈ సినిమా సూపర్‌గా ఉందని అన్నారు. ఆదిత్యధర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిద్దారని చెప్పుకొచ్చారు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఉరి’ సినిమా కూడా తనకు ఇష్టమే అని అన్నారు. ఈ మూవీ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. సీక్వెల్ కూడా సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ధురంధర్2 మార్చి 19న మూవీ హిందీతో పాటు, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతుంది.
