నాటి సాయుధ పోరాట స్ఫూర్తితోనే.. ఇప్పుడు ప్రజాపాలన సాధించుకున్నాం..
తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాయి కాంగ్రెస్ శ్రేణులు. పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం ఈ రోజు.. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది.. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనం అనుభవిస్తోన్న ప్రజాస్వామ్యం.. ప్రపంచఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది 1948, సెప్టెంబర్ 17… ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి, స్వేచ్ఛాపతాకను ఎగుర వేసిన రోజు.. ఈ గడ్డపై రాచరికానికి గోరీ కట్టి… ప్రజా పాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17.. అందుకే ఇది ప్రజా పాలన దినోత్సవం.. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు. స్వేచ్ఛ మన జీవన విధానం.. ఆ స్వేచ్ఛా సాధనకు ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడని జాతి మనది.. అణచివేత, పెత్తందారీతనం, నియంతృత్వం, బానిసత్వం సంకెళ్లను బద్ధలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి.. అదే విధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరోమైలు రాయి.. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్లీ నియంతృత్వ నిర్భందంలోకి జారి పోయిన తీరు గడచిన పదేళ్లలో మనం చూశాం.. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి, ప్రజా పాలనను తెచ్చుకున్నాం.
కాళేశ్వరంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో మనం విఫలమయ్యాం..
మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో కార్తకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని విషయాలలో మనం మార్కెటింగ్ సరిగ్గా చేసుకోలేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కేసీఆర్ గురించి చెప్పడంలో మనం విఫలం అయ్యాము.. 1940 లో మొదలు పెడితే ఏపీలో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు.. కానీ అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు.. కెసిఆర్ చెబుతుంటే పెన్ను పట్టుకొని రాసుకోండి అంటే మాకే కోపం వచ్చేదని అన్నారు. కానీ అర్థం చేసుకున్న తర్వాత వాళ్లకు కాళేశ్వరం గొప్పతనం తెలిసింది.. సాగునీరు మాత్రమే కాదు.. హైదరాబాద్ కు తాగునీళ్లు తెచ్చేందుకు కాళేశ్వరం కట్టారు.. కాళేశ్వరం కూలేశ్వరం అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది.. ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టాలి.. రూపాయి పైసా కూడా ప్రజల సొమ్ము వృధా కాలేదు.. కానీ కమీషన్ వేసి డబ్బులు ఖర్చు చేశారు.. అసెంబ్లీలో హరీష్ రావు తో పాటు అక్బరుద్దీన్ ఓవైసీ నిలదీస్తే సమాధానం లేదు.. ఈ డాక్యుమెంటరీ ని గ్రామ గ్రామాన తీసుకెళ్లాలి అని సూచించారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో గత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి రిపోర్ట్ ను అందించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించింది.
బంగారం హోల్‌సేల్ వ్యాపారం చేసే బిజినెస్‌మెన్‌లే టార్గెట్‌గా.. హైదరాబాద్ లో ఐటీ దాడులు
హైదరాబాద్ లో ఐటీ శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. బంగారం హోల్‌సేల్ వ్యాపారం చేసే బిజినెస్‌మెన్‌లే టార్గెట్‌గా ఐటి దాడులు నిర్వహించారు. ఇవాళ ఉదయమే నగరంలోని పలు ప్రాంతాలలో బంగారు వ్యాపారాల ఇండ్లపై దాడులు చేశారు ఐటి శాఖ అధికారులు.. బంగారం హోల్‌సేల్ లావాదేవీలపై ఆరాతీశారు. కొనుగోలు అమ్మకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంగారం వ్యాపారంపై దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ డీటెయిల్స్ తీసుకున్నారు. గత ఐదేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు అధికారులు. హైదరాబాదులోని క్యాప్స్ గోల్డ్ కంపెనీ పై ఐటి సోదాలు.. 15 చోట్ల సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ.. హైదరాబాద్, వరంగల్, విజయవాడలో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేస్తున్న క్యాప్స్ గోల్డ్ కంపెనీ… బంగారం కొనుగోలు చేసి రిటైల్ గోల్డ్ షాప్స్ కు అమ్ముతున్న క్యాప్స్ గోల్డ్ కంపెనీ.. క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్‌సేల్ గా ఉన్న సంస్థలపై ఐటి సోదాలు నిర్వహించింది. బంజారా హిల్స్ లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు.. పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకులు పాల్పడ్డట్టు గుర్తించారు అధికారులు.
ఎక్కడ ఖర్చు పెట్టాలో కాదు, ఎక్కడ నియంత్రించాలో తెలిసిన వ్యక్తి నిర్మలా సీతారామన్: మంత్రి పయ్యావుల
జీఎస్టీ సంస్కరణల మీద ప్రధాని మోడీ ప్రకటన చేసిన నెల రోజుల వ్యవధిలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దాన్ని సుసాధ్యం చేసింది అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. GST సంస్కరణలను అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఆమోదించడం సక్సెస్ కి ఉదాహరణ అన్నారు. రెండు స్లాబ్స్ విధానం అమలు చేయడం ఈజీ వ్యవహారం కాదు.. దాని వెనుక విస్తృతమైన కృషి దాగి ఉందన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ టిపికల్ ఇండియన్ మదర్ అని ప్రసంశించారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో.. ఎక్కడ నియంత్రించాలో తెలిసిన సీతారామన్ అద్భుతమైన పద్ధతిని ప్రతిపాదించి అమలు చేస్తున్నారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. అయితే, విభిన్నపార్టీలు రాజకీయ వైరుధ్యాలతో పని చేస్తున్నప్పటికీ, జీఎస్టీ సంస్కరణల విషయంలో భిన్నాభిప్రాయాలు లేకుండా వ్యవహరించారు అని పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. ఫైనాన్స్ మంత్రి దగ్గర అందరూ లాబీయింగ్ చేస్తే పేద వాళ్ల కోసం లాబీయింగ్ చేసిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ.. ఎన్నికల ముందు రేట్లు తగ్గించడం చూస్తాం.. కానీ, దేశం కోసం పని చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వం నిత్యం సంస్కరణ విధానంలో పని చేస్తుంది అన్నారు. MSME లకు క్రెడిట్ గ్యారెంటీస్ సహా కీలక విధానాలు అమలు చేస్తున్నారు అని ఆర్థిక మంత్రి కేశవ్ తెలిపారు.
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్తత..
కృష్ణ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మూలపాడులోని VTPS లో ఫ్లయాష్‌ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పెద్ద ఎత్తున నిల్వ ఉంచారనీ, ఆ ఫ్లయాష్‌ను స్థానిక లారీ యజమానులకు పంపిణీ చేస్తామని పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరిన మాజీ మంత్రి జోగి రమేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత జోగి రమేష్ ను భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇక, బారికెడ్లు పెట్టి ఎటు వెళ్లకుండా వైసీపీ నేతలను పోలీసులు నిలువరించారు. కార్యకర్తలు, నాయకులు నెట్టుకొని వెళ్లే ప్రయత్నం చేసిన పోలీసులు మాత్రం ఎటు కదలనియలేదు. అలాగే, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెడ్ బుక్ రాజ్యాంగం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
నక్సలైట్లను చంపితే ఫ్యాక్షనిస్టులకు, ప్రభుత్వానికి తేడా ఏముంది..?
మావోయిస్టులు తుపాకీ వదిలి శాంతి చర్చలకు వస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. టెర్రరిస్టులు వేరు, నక్సలైట్లు వేరు.. ప్రధాని మోడీ నక్సలైట్లపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం అన్నారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను చంపడాన్ని వ్యతిరేకిస్తున్నాం.. బస్తర్ అడవులను ఖాళీ చేయించి విలువైన ఖనిజాలు పెత్తందార్లకు ఇవ్వాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. నక్సలైట్లను చంపితే ఫ్యాక్షనిస్టులకు ప్రభుత్వానికి తేడా ఏముంది అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నక్సలైట్లతో చర్చలు జరపాలి అని డిమాండ్ చేశారు. లేదంటే, బంగ్లాదేశ్ లో ఎంపికైన ప్రభుత్వాన్ని ప్రజలే కూలగొట్టారు.. శ్రీలంక, నేపాల్ లో కూడా ఇలాగే జరిగింది.. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వమే నేపాల్ తిరుగుబాటుకు ప్రధాన కారణం అని సీపీఐ నారాయణ వెల్లడించారు. ఇక, 75 ఏళ్లు దాటిన వాళ్లు పార్టీలో ఉండొచ్చు.. నాయకత్వంలో ఉండకూడదు అని నారాయణ చెప్పుకొచ్చారు. సీపీఐలో కూడా దీనిపై ఛండీఘడ్ లో జరిగే సదస్సులో చర్చిస్తామన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలో కూడా 75 ఏళ్లు దాటితే నాయకత్వం వదులుకోవాలనే దానిపై చర్చ జరుగుతుంది.. బహుశా రెండు మూడు నెలల్లో అది జరుగుతుందేమో అన్నారు. 2029 ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉద్యమం చేపడుతుంది. అలాగే, మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మిస్తే ప్రజలకు ఉపయోగం ఉండదు.. డబ్బులు లేవంటూనే అమరావతి నిర్మాణం చేస్తున్నారు కదా.. అలాగే, మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్మించాలి అని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
జీఎస్టీ సంస్కరణలు.. 99% వస్తువులపై 5 శాతానికి తగ్గింపు..
విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ట్యాక్స్ లు కొన్ని సెక్షన్లకు మాత్రమే వర్తిస్తే.. కానీ, జీఎస్టీ 140 కోట్ల మంది ప్రజల మీద ప్రభావం చూపిస్తుందన్నారు. జీఎస్టీ 2.O అమలులోకి రాక ముందే ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఆఫర్లు ప్రకటించడం కనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. నవరాత్రులు ప్రారంభం నుంచే కొత్త జీఎస్టీ విధానం పని చేస్తుంది అని తెలియజేసింది. విస్తృతమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు అమలు చేయడం జరుగుతుంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించింది. అయితే, 12 శాతం ట్యాక్స్ విధానంలో ఉన్న 99 శాతం ప్రొడక్ట్స్ 5 శాతంలో కి వచ్చేస్తాయని కేంద్రమంత్రి నిర్మలా తెలిపింది. 2017కు ముందు జీఎస్టీ ట్యాక్స్ పేయర్లు 66 లక్షల మంది 1.51 లక్షల మందికి ఈ 8 ఏళ్లలో పెరిగారు.. గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అక్షేపించినా వినియోగదారులకు అంతిమంగా మేలు జరుగుతుంది.. వన్ నేషన్- వన్ ట్యాక్స్ విధానానికి జీఎస్టీ కౌన్సిల్ ఫెడరల్ వ్యవస్థగా మారింది.. న్యూజెన్ ట్యాక్స్ వల్ల రెండ లక్షల కోట్ల వరకు ప్రజల చేతుల్లో నగదు ఉంటుంది.. పప్పులు, ఉప్పులు సహా అన్నీ 5 శాతం పరిధిలోకి వచ్చేశాయ్ అని వెల్లడించింది. జీఎస్టీ 2.O స్థూలంగా మధ్య తరగతికి మేలు చేసే విధంగా రూపొందించాం.. పేద, మధ్య తరగతి, రైతులు, MSMEలు, దేశానికి ఉపయోగమైన సెక్టార్స్ ను పిల్లర్స్ గా పెట్టుకుని జీఎస్టీ రూపకల్పన జరిగింది అని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ పేర్కొనింది.
దేశం కోసం చాలా సాధించారు.. ఇజ్రాయెల్ ప్రధాని స్పెషల్ వీడియో విడుదల
ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీకి బర్త్‌డే విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీని ఆయా దేశ ప్రధానులు వీడియోలు ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకరోజు ముందే.. మంగళవారమే మోడీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దాదాపు 3 నెలల తర్వాత మోడీ-ట్రంప్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. సుంకాల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్ల తర్వాత మోడీ-ట్రంప్ మాట్లాడుకోవడంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇక మోడీ తనకు మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా వీడియోలో మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. భారతదేశం కోసం చాలా సాధించారంటూ నెతన్యాహు కొనియాడారు. భారతదేశం-ఇజ్రాయెల్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. రెండు దేశాలు మంచి విజయాలను సాధించాయని నెతన్యాహు ప్రశ్నించారు. అలాగే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా మోడీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. రెండు దేశాల మధ్య మంచి భాగస్వామ్యం ఉందని ప్రశంసించారు. అలాగే మోడీ మంచి స్నేహితుడు అంటూ తెలిపారు. భారతదేశంతో ఇంత బలమైన స్నేహాన్ని పంచుకోవడానికి ఆస్ట్రేలియా స్వాగతిస్తుందన్నారు. ఇక ఆస్ట్రేలియాలో భారతదేశ సమాజం అందిస్తున్న అద్భుతమైన సహకారానికి ప్రతిరోజూ కృతజ్ఞతలమై ఉన్నట్లు చెప్పారు.
అక్టోబర్‌లో భారత్‌కు రానున్న యూకే ప్రధాని కీర్ స్టార్మర్!
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా తేదీలు ప్రకటించనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి భారత్‌లో పర్యటించే ఛాన్సుందని తెలుస్తోంది. ఇక ముంబైలో జరిగే ఫిన్‌టెక్ సమావేశంలో కూడా కీర్ స్టార్మర్ పాల్గొంటారని సమాచారం. ప్రధాని మోడీ ఇటీవల లండన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫిన్‌టెక్‌పై ఒప్పందాలు జరిగాయి. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కీర్ స్టార్మర్ అక్టోబర్‌లో భారత్‌కు రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా వేసవిలోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా అప్పుడు సాధ్యం కాలేదు. దీంతో అక్టోబర్ చివరి నాటికి పర్యటన ఉండొచ్చని వర్గాలు పేర్కొన్నాయి. ఫిన్‌టెక్ సమావేశంలో భాగంగా కీర్ స్టార్మర్ ముంబైలోనే ఉండొచ్చని వర్గాలు భావిస్తున్నాయి. గత సంవత్సరంలో ప్రధాని మోడీ-కీర్ స్టార్మర్ అనేక సార్లు కలిశారు. ఇక గత జూలైలో కూడా మోడీ లండన్‌లో పర్యటించారు. బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు చేశారు. రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని భావించారు. ఇక పర్యటనలో భాగంగా కింగ్ చార్లెస్-3ని మోడీ కలిశారు. ఈ సందర్భంగా మోడీకి చార్లెస్ ప్రత్యేక విందు ఇచ్చారు.
గోల్డ్ ధర భారీగా తగ్గిందోచ్.. నేడు తులం ఎంతంటే?
బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 220 తగ్గింది. కిలో సిల్వర్ ధర రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,171, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,240 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గింది. దీంతో రూ.1,02,400 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 తగ్గింది. దీంతో రూ. 1,11,710 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,860 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,42,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,32,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రధాని మోడీకి టాలీవుడ్ స్టార్ హీరోస్ బర్త్ డ్ విషెష్,,, ఎవరెవరు ఏమన్నారంటే
భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ, వ్యాపార రంగాలలోని ప్రముఖులు సినిమా నటులతో ఇతర దేశాల అధ్యక్షులతో పాటు కూడా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు నరేంద్ర మోడీ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు. వారిలో ఎవరెవరు ఏమన్నారంటే.. JR NTR : అత్యంత శ్రద్ధాసక్తుడు మరియు అంకితభావం కలిగిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన దేశాన్ని ప్రపంచపటంలో గర్వించే విధంగా చేసేందుకు మీ అవిశ్రాంత ప్రయత్నాలు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ప్రకాశింపజేయాలి. Ram Charan : మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మన దేశానికి సేవ చేయడంలో మీకు ఆరోగ్యం, బలం మరియు నిరంతర విజయం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. Mega Star : గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. భారతదేశాన్ని పురోగతి మరియు కీర్తి యొక్క ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి మీకు మంచి ఆరోగ్యం, బలం మరియు జ్ఞానం ఉండాలని కోరుకుంటున్నాను.
ఆ సినిమా నా ప్రపంచాన్ని మార్చేసింది
సిరియల్స్‌లో చిన్న క్యారెక్టర్స్‌లో అలరించి.. ప్రజంట్ బాలీవుడ్ టూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాగుర్. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగాలి అంటే మాములు విషయం కాదు. చాలా సవాల్‌లు ఎదురుకొవాల్సి ఉంటుంది. అలాంటిది చిన్న సైడ్ క్యారెక్టర్ నుండి హీరోయిన్ గా మార్కెట్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రతి ఒక్కరి కెరీర్ లో గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా అంటూ ఒకటి ఉంటుంది. తాజాగా తన కెరీర్‌లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిన చిత్రమే లవ్ సోనియా అని మృణాల్ ఠాకూర్ అంటోంది. ఇటీవల ఈ సినిమా విడుదలై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగంగా ఒక పోస్ట్ షేర్ చేసింది.. మృణాల్ మాట్లాడుతూ “ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అమ్మాయిని నేను. వేల మందిలో నన్ను లవ్ సోనియాకి ఎంపిక చేసుకోవడం నిజంగా అదృష్టంగా అనిపించింది. ఇది నా మొదటి సినిమా మాత్రమే కాదు, జీవితాలను మార్చగలిగే సినిమా ప్రపంచంలోకి వేసిన తొలి అడుగు. ఆ సెట్లో పని చేసినప్పుడు కలిగిన భయం ఇంకా నాకు గుర్తుంది” అని పేర్కొంది. ఆమెతో కలిసి నటించిన డెమి మూర్, రిచా చద్దా, మనోజ్ బాజ్‌పేయీ లాంటి ప్రముఖ నటులు ప్రతిరోజూ కొత్తగా ఏదో నేర్పారని గుర్తుచేసుకుంది. “ఆ సమయంలో నేను విశాలమైన సముద్రం లో అతి చిన్న చేపల అనిపించుకున్నా. కానీ ఈ సినిమా నాకెంతో ఇచ్చింది – మాట్లాడే ధైర్యాన్ని, చిత్ర పరిశ్రమలో మరో కుటుంబాన్ని, ఒక కొత్త జీవనాన్ని” అని మృణాల్ భావోద్వేగంగా తెలిపింది. తనకు మద్దతుగా నిలిచి, ప్రేమను పంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, లవ్ సోనియా తన కెరీర్‌ని మాత్రమే కాకుండా, తన జీవితాన్ని కూడా మలిచిందని మృణాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.