సినీ, బుల్లితెర క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ ప్రేక్షకులకు చిర పరిచితుడైన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు గత రాత్రి మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. ఎలాగైనా సినిమాల్లో నటించాలని పట్టుదల ఆయనలో కనిపించింది.
టాలీవుడ్‌లో 1995లో ‘ఊరికి మొనగాడు’సినిమాతో అడుగుపెట్టారు. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో రాజబాబు నటించారు. 62 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు.
Also Read
అంతేకాదు బుల్లితెర పై కూడా అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి వంటి సీరియళ్ళలో ఆయన నటించారు. అమ్మ సీరియల్‌లోని పాత్రకు 2005లో నంది అవార్డు గెలుచుకున్నారు. రాజబాబు ఆకస్మిక మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!