హైదరాబాద్, 22 ఆగస్ట్ 2024: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సర్ప్రైజ్తో వచ్చేస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్‌ని ఇక నుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమైంది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ ఆగస్ట్ 25 నుంచి ఆదివారం కూడా ప్రసారం అవుతాయి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, మా అన్నయ్య, నిండు నూరెళ్ళ సావాసం,…
తెలుగు సినీ ప్రేక్షకులకు చిర పరిచితుడైన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు గత రాత్రి మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. ఎలాగైనా సినిమాల్లో నటించాలని పట్టుదల ఆయనలో కనిపించింది. టాలీవుడ్‌లో…