30న పబ్లిక్ కోర్టులోకి ‘తిమ్మరుసు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిత్రాలతో విలక్షణ కథానాయకుడిగా మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్ వాలి’ అనేది దాని ట్యాగ్‌లైన్. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా మహేశ్ కోనేరుతో పాటు సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇదే నెల 30న విడుదల చేస్తున్నారు.
Read Also: వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు..
Also Read
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సత్యదేవ్ మాట్లాడుతూ “‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా చేసిన తర్వాత ఎలాంటి మూవీ చేయాలని అనుకుంటున్న సమయంలో ‘తిమ్మరుసు’ కథ విన్నాను. నచ్చింది. నిర్మాతలు మహేశ్, సృజన్‌లతో మాట్లాడిన తర్వాత సినిమాను స్టార్ట్ అయ్యింది. అయితే డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి చాలా సరదాగా అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. తనెలా డైరెక్ట్ చేస్తాడోనని చిన్న టెన్షన్ ఏర్పడింది. కొన్ని రోజులు షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత, శరణ్ పంథా ఏమిటో తెలిసింది. సినిమాటోగ్రాఫర్ అప్పూ ప్రభాకర్ బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. ప్రియాంక జవాల్కర్ వండర్‌ఫుల్ కోస్టార్. శ్రీచరణ్ ఎక్సలెంట్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందించారు” అని అన్నారు.
Read Also: ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ కౌంటర్!
కొవిడ్ పరిస్థితుల్లో షూటింగ్‌ను తగు జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి చేసే క్రమంలో సత్యదేవ్, ఇతర ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ఎంతో సపోర్ట్ చేశారని నిర్మాతల్లో ఒకరైన మహేశ్ కోనేరు తెలిపారు. ఇందులో సత్యదేవ్ లాయర్‌గా నటిస్తున్నారని ఆయన లుక్, క్యారెక్టర్ డిజైనింగ్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఇందులో ఉందన్నారు.
దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ “శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. చక్కగా వ్యుహాలు చేయడమే కాదు. నిజాయతీగల వ్యక్తి. అలాంటి ఇంటెలిజెంట్ లాయర్ పాత్రలో సత్యదేవ్ చేస్తున్న డిఫరెంట్ అటెంప్ట్. పరిచయమైన కొద్దిరోజుల్లో మంచి స్నేహితుడయ్యాడు. మంచి సపోర్ట్ అందించడంతో అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేశాం. కొవిడ్ నేపథ్యంలో చాలా కేర్ తీసుకుని చాలెంజింగ్ సిట్యువేషన్స్‌లో పూర్తి చేసిన ఈ సినిమాను, కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో విడుదల చేయడం ఆనందంగా ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, వైవా హర్ష, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..