వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు..

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ విజయమ్మ… వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి రాక ముందు తెలంగాణలో రక్తం మరకలు ఉంటే… వైఎస్ వచ్చాక ఆ భూముల్లో నీళ్లు పారాయన్న ఆమె.. తుపాకుల చప్పుళ్లు తగ్గాయన్నారు.. మీ కుటుంబ సభ్యురాలుగా నా బిడ్డను చేర్చుచుకోండి అని కోరిన ఆమె.. అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని.. తెలుగు రాష్ట్రాలు ఒక్కటే.. రాష్ట్రాల మధ్య అభిప్రాయ బేధాలు రావొచ్చు.. కానీ, సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.. చట్టాలు ఉన్నాయి, బోర్డులు ఉన్నాయి.. అన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు వైఎస్ విజయమ్మ. ఇక, రాజశేఖర్ రెడ్డి బిడ్డలు దొంగలు కాదు, గజ దొంగలు కాదు అంటూ వ్యాఖ్యానించిన ఆమె.. మాట పోతే ప్రాణం పోయినట్లు అనుకుంటారని.. మేం ఎవర్ని దోచుకోలేదు, ఏమి దాచుకోలేదన్నారు.. అన్ని ప్రాంతాలని వైఎస్ సమానంగా చూవారని.. అందుకోసమే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

వైఎస్ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చిందంటే .. చూసి నేర్చుకోవాలి.. వైఎస్ ను నాయకుడిగా ఒప్పుకోవాల్సిందేనన్నారు షర్మిలమ్మ.. ఆయన చనిపోయిన తరువాత దోషిగా ఎందుకు పెట్టారు? నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా..? నాయకుడంటే నమ్మకం, ఆప్యాయత.. నాయకుడంటే… ఎన్ని కష్టాలు వచ్చినా ఒక ధైర్యం.. కష్టాల్లో ఆడుకుంటాడని నమ్మకం.. నాయకుడంటే కొండను ఢీకొట్టే సాహసం… సమస్యలు తీర్చడమే నాయకుడి లక్ష్యం.. తెలంగాణ ప్రజల్ని అడిగితే వినబడేది, కనబడేది వైఎస్సార్ అన్నారు.. తెలుగువారి గుండె చప్పుడు వైఎస్సార్.. ఈ గడ్డ ప్రజల్ని ఆయన ఎక్కువ ప్రేమించారన్న ఆమె… జనం కోసమే ఆయన పని చేశారు.. తెలంగాణ కోసం ఎన్నో చేశారు.. ఈ ప్రాంతానికి వైఎస్సార్ పెద్దపీట వేశారని.. వైఎస్ కల్మషం లేని వ్యక్తి, తెలంగాణ సస్యశ్యామలం కావాలని ఆయన నాతో చెప్పారని గుర్తుచేసుకున్నారు.. బిడ్డలకు బంగారు జీవితం ఇస్తేనే బంగారు తెలంగాణ అయినట్లు అన్నారు విజయమ్మ.. రక్తంలో విశ్వసనీయత ఉంది.. ఆయన రక్తంతో పుణికి పుచ్చుకున్నారు జగన్, షర్మిల.. పట్టుదలకు, శ్రమకు వారసులు.. ఈ పార్టీ ఏర్పాటు దైవ సంకల్పం అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-