ఆ ఇద్దరి డిమాండ్ మామూలుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదేళ్ళ క్రితం కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే ఆ పైన మాత్రం అమ్ముడు నటించిన చిత్రాలన్నీ పరాజయం పాలైనాయి. ఈ ఐదేళ్ళలోనే తమిళ, హిందీ, పంజాబీ భాషా చిత్రాలలోనూ మెహ్రీన్ తన అదృష్టం పరీక్షించుకుంది. ఇక తెలుగులో ప్రస్తుతం ఎఫ్ 3లో నటిస్తోంది. ఈ యేడాది మార్చిలో మెహ్రీన్ వివాహ నిశ్చితార్థం భవ్య భిష్ణోయ్ తో జరిగింది. ఇదే ఏడాది వీరు పెళ్ళి పీటలు కూడా ఎక్కుతారని అంటున్నారు. ఈ సమయంలో సినిమాలు కాస్తంత తగ్గించుకున్నట్టుగా కనిపిస్తున్నా… మెహ్రీన్ ఠక్కున మరో రెండు అవకాశాలను చేజిక్కించుకుంది. అందులో ఒకటి మారుతీ దర్శకత్వ పర్యవేక్షణలో వెబ్ సీరిస్ కాగా, మరొకటి మారుతీ దర్శకత్వం వహించ బోతున్న ఓటీటీ మూవీ. ఈ సినిమా కోసం మెహ్రీన్ ఏకంగా యాభై లక్షలు డిమాండ్ చేసిందట. అయితే…. ఆమెకు నచ్చజెప్పి 40-45 లక్షల మధ్యలో సెట్ చేశారట. ఈ అమ్మడి కథ ఇలా ఉంటే… మరో టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా సైతం తన రెమ్యూనరేషన్ ను పెంచేసిందట. నిజానికి రకుల్ ప్రీత్ కు ఈ మధ్యకాలంలో సరైన హిట్ అనేది పడలేదు. అయితే ప్రతి రోజు పండగే చిత్రానికి రూ.75 లక్షల పారితోషికం తీసుకున్న రాశీఖన్నా.. ఇప్పుడు దాదాపు కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట. ఈ తేనెకళ్ళ చిన్నది గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్‌తో పాటు నాగచైతన్య థ్యాంక్యూ మూవీలో నటిస్తోంది. సక్సెస్ ఉన్నప్పుడు ఓకే కానీ ఫ్లాపుల్లో సైతం ఈ అందాల భామలు ఇంతగా పారితోషికాన్ని పెంచేశారేమిటీ అని అందరూ ఆశ్చపోతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్‌షీట్‌పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?