టాలీవుడ్ లో మేకోవర్ అయిన స్టార్ హీరోల గురించి మాట్లాడాలంటే మొదట ఎన్టీయార్ పేరే చెప్పాలి. ‘యమదొంగ’ సినిమాకు ముందు… ఆ తర్వాత ఎన్టీయార్ లో వచ్చిన మార్పు అనితర సాధ్యం అనిపిస్తుంది. అదీ కేవలం ఆరేడు నెలల్లో ఎన్టీయార్ సాధించడం గ్రేట్. 2006లో వచ్చిన ‘రాఖీ’లో బాగా లావుగా కనిపించిన ఎన్టీయార్ ను 2007 లో ‘యమదొంగ’ నాటికి రాజమౌళి కరెంట్ తీగలా మలిచేసేశారు. ఇప్పుడు కూడా ఎన్టీయార్ ‘ట్రిపుల్ ఆర్’ మూవీ కోసం అలానే తయారయ్యారు. అయితే… ఇందులో గిరిజన నాయకుడు కొమరం భీమ్ తరహా పాత్రను పోషిస్తున్నారు కాబట్టి… ఎన్టీయార్ కొద్దిగా లావుగానే కనిపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ వెంటనే ఉన్న కొరటాల శివ మూవీ కోసం మళ్ళీ యంగ్ టైగర్ మేకోవర్ పనిలో పడ్డాడని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఎన్టీయార్ బరువు తగ్గుతున్నాడట.
ఎన్టీయార్, రామ్ చరణ్ నటిస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అలానే కొరటాల తెరకెక్కిస్తున్న చిరంజీవి ‘ఆచార్య’ సైతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ‘ఆచార్య’ విడుదల తేదీలో క్లారిటీ లేకపోయినా.. ‘ట్రిపుల్ ఆర్’ మాత్రం దసరా కానుకగా అక్టోబర్ 13నే వస్తుందంటున్నారు. సో… ఈ లోగానే ఎన్టీయార్ – కొరటాల మూవీ సెట్స్ పైకి వెళ్ళినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఏదేమైనా…. కొరటాల మూవీలో కొత్త ఎన్టీయార్ ను చూడొచ్చని చిత్ర బృందం అభిమానుల్లో ఆశలు రేపుతుండటం విశేషం.