మంగ్లీ బోనాల పాట లిరిక్స్ పై రచ్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగర్ మంగ్లీ పండగ ఏదైనా తన పాట మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. జానపద, పల్లె పాటలు, దేవుళ్ళ పాటలకు సంబందించిన పాటలు పాడుతున్న మంగ్లీ ఈమధ్య కాలంలో చాలా ఫేమస్ అయ్యారు. భిన్నమైన స్వరం కలిగిన ఆమె సినిమాల్లోనూ ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణిస్తున్నారు. అయితే రీసెంట్ ఆమె పాడిన బోనాల పాట సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపింది. ‘చెట్టు క్రింద లెక్క కూసున్నవమ్మా చుట్టం లెక్కా మైసమ్మా’.. అనే ఓ బోనాల సాంగ్ యూట్యూబ్ లో వారం కిందట విడుదల చేశారు. ఈ పాటను రామస్వామి అనే లిరిసిస్ట్ రాయగా, రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు. అయితే ఈ పాటలోని లిరిక్స్ గ్రామ దేవతలను విమర్శిస్తున్నట్లు ఉన్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మంగ్లీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొక్కినట్టులేదు.. తిడుతున్నట్టుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది రైటర్ తప్పు అంటూ.. మంగ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. హిందూవాదులు కూడా ఈ పాటపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తొలగించాలంటున్నారు.
Also Read
- VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
- Anaganaga Australia Lo Review: 'అనగనగా ఆస్ట్రేలియాలో' రివ్యూ!
- Pushpa 2 Special Song: 'పుష్ప-2 ది రూల్'లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం