‘మేజర్’ ఓవర్సీస్ హక్కులు ఎవరికంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్‌రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా మేజర్. ఈ పాన్ ఇండియా మూవీని గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఎన్.ఎస్.జీ. కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను అడివి శేష్ పోషిస్తున్నాడు. జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కావాల్సిన ఈ సినిమాను కరోనా పేండమిక్ సిట్యుయేషన్ ను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేశారు. అయితే… నిర్మాణానంతర కార్యక్రమాలతో పాటు మిగిలిన వ్యాపార వ్యవహారాలూ సజావుగా సాగిపోతూనే ఉన్నాయి. విశేషం ఏమంటే… ఇంకా విడుదల తేదీ ఖరారు కాకపోయినా, మూవీకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓవర్సీస్ హక్కుల్ని వీకెండ్ సినిమా యూఎస్ సంస్థ సదరన్ స్టార్ తో కలిసి సొంతం చేసుకుంది. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ను ఇకపై వరుసగా ఇస్తామంటూ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. మొత్తం మీద థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునే సమయానికి మేజర్ తొలికాపీ సిద్ధమయ్యేలా ఉంది. ముంబై 26/11 ఉగ్రవాద దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించిన అమర వీర జవాను, ఎన్ఎస్జీ కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలే నెలకొని ఉండటం విశేషం.
Also Read
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!