Kangana Ranaut: అందుకే ధాకడ్ ఫ్లాప్ అయింది.. కంగనా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు కంగనా రనౌత్. వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్. తాజాగా థాకడ్ మూవీ ఫ్లాప్ కావడంపై ఆమె మండిపడుతోంది. ఈ మూవీపై వచ్చిన వ్యతిరేక ప్రచారమే సినిమా పరాజయానికి కారణమంటోంది కంగనా. తన నిర్మాత ఆస్తులు, ఆఫీసులు అమ్ముకోలేదని, కొందరు చిల్లర వ్యక్తుల దుష్ర్పచారం వల్ల కొంత ఇమేజ్ తగ్గిందన్నారు. సినిమాపై నిర్మాత సంతృప్తికరంగానే ఉన్నారని వ్యాఖ్యానించింది.
‘ధాకడ్’ సినిమాపై ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ పెరిగిందని, అది చూసి సినిమా చూడడానికి జనం రావడం లేదంటున్నారు కంగనా. అలాంటి వార్తలు రాసేవారిని ఆమె చిల్లర వ్యక్తులుగా కంగనా అభివర్ణించారు. ధాకడ్ సినిమా పరాజయంతో నిర్మాత ఆస్తులు అమ్ముకున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఆ సినిమా నిర్మాత ఆస్తులు, ఆఫీసులు అమ్ముకోలేదని పేర్కొన్నారు. సినిమా ఫలితంపై నిర్మాత దీపక్ ముకుత్ సంతృప్తిగానే ఉన్నట్టు చెప్పారు. కొంతమంది వల్ల ఇలాంటి దురభిప్రాయం ఏర్పడిందన్నారు కంగనా. ఈ సినిమాపై వస్తున్న వార్తల్ని తాను చదువుతున్నానన్నారు.
Also Read
ఇప్పటికే ఫ్లాప్ అయిన గంగూబాయి కఠియావాడి, జుగ్‌జుగ్‌జీయో, 83 సినిమాల ప్లాప్‌ల గురించి మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అర్జున్ రాంపాల్, దివ్యదత్తా, కంగన తదితరులు నటించిన ఈ సినిమాను రూ. 80 కోట్ల బడ్జెట్‌తో కొత్త దర్శకుడు రజనీష్ ఘాయ్ తెరకెక్కించారు. కంగన కెరియర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా కేవలం రూ. 4 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
Delhi: ఢిల్లీలో మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం.. అమిత్ షాతో కీలక చర్చలు
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..