మొన్నటి దాకా అందరూ కరోనా, వైరస్, కంటైన్మెంట్, క్వారంటైన్ లాంటి పదాలు వాడారు. కానీ, ప్యాండమిక్ చలువతో ఇప్పుడు అందరి నోళ్లలో వ్యాక్సిన్, జ్యాబ్స్, ఇనాక్యులేషన్, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ లాంటి పదాలు తెగ నానుతున్నాయి. గత కొన్ని రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ రియల్ గా ఫాస్ట్ పేస్ లోకి వచ్చేసింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు టీకాలు ఎక్కువ మందికి ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఐడల్ 12 కంటెస్టెంట్స్ కూడా కరోనాకు విరుగుడుగా సూది మందు తీసేసుకున్నారు. ఇప్పుడు టాప్ సెవన్ ఇండియన్ ఐడల్ సింగర్స్ వ్యాక్సిన్ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి…
ఇండియన్ ఐడల్ రియాల్టీ షో ప్రతీ సంవత్సరం దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతూ ఉంటుంది. చాలా మంచి సింగర్స్ గా ఆ షో ద్వారా ప్రపంచం ముందుకి రావటంతో ఇండియన్ ఐడల్ స్థాయి పెరుగుతూ వచ్చింది. ఈసారి కాస్త ఓవర్ యాక్షన్ జరుగుతోందని, గాయనీగాయకుల ప్రతిభ కంటే మెలోడ్రామా అధిక ప్రాధాన్యం పొందుతోందని విమర్శలు వచ్చాయి. అవన్నీ ఎలా ఉన్నా ఇండియన్ ఐడల్ 12 స్లోగా గ్రాండ్ ఫినాలే దిశగా సాగుతోంది. టాప్ సెవన్ కంటెస్టెంట్స్ ప్రస్తుతం పోటీలో ఉన్నారు. వారిలో ఎవర్ని ఇండియన్ ఐడల్ 12 టైటిల్ వరిస్తుందో చూడాలి…
అరుణిత కంజిలాల్, పవన్ దీప్ రజన్, సయాలీ కాంబ్లీ, షణ్ముఖప్రియ, ఆశిష్ కులకర్ణి, మహ్మద్ దానిష్, నిహాల్ తౌరో… వీరే ప్రస్తుతం ఇండియన్ ఐడల్ ఫైనల్ దిశగా పరుగు తీస్తోన్న టాలెంటెడ్ సింగర్స్. వీరంతా వ్యాక్సినేషన్ తీసుకుని స్వర సమరానికి కొత్త ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. నలుగురు బాయ్స్, ముగ్గురు గాళ్స్ వేరువేరుగా గ్రూప్ ఫోటోస్ కి ఫోజులిచ్చారు. కాగా ఒక్కో ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ కూడా ‘ఐ యామ్ ఏ వారియర్. నౌ ఐ యామ్ వ్యాక్సినేటెడ్’ స్లోగన్స్ తో సోలో ఫోటోలు దిగారు. ఇండియన్ ఐడల్ 12 వ్యాక్సినేషన్ పిక్స్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్నాయి!