Director Vamsi Krishna Comments on Tiger Nageswar Rao: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు వంశీ కృష్ణ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలు పంచుకున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ కథను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి అని అడిగితే దానికి ఆయన మాట్లాడుతూ ప్రతి దర్శకుడికి ఒక బయోపిక్ చేయాలని ఉంటుంది, ‘నాయకుడు’ చిత్రం నాకు చాలా ఇష్టం అని,చిన్నప్పటినుంచి మనసుకి దగ్గరైన చిత్రమదని అన్నారు. అందుకే నేను చేసే సినిమాల్లో ఒక బయోపిక్ చేయాలనుకున్నా, బయోపిక్స్ చాలా వరకు క్రీడాకారులు, నాయకులు, సినీ తారలపై ఉంటాయి కానీ బయోపిక్ లో తెలియని కథ కూడా చెప్పవచ్చని అన్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి దాదాపు రెండేళ్ళు రీసెర్చ్ చేశాం, రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాక చాలా విషయాలు తెలిశాయి, ఆ పాత్ర నన్ను కూడా వదల్లేదని అన్నారు. టైగర్ నాగేశ్వరరావు మనకి తెలిసినంతవరకూ ఒక దొంగే కానీ ఆయన ఇన్నర్ సోల్ ఎవరికీ తెలీదు.
Kajal Aggarwal: బాలకృష్ణ అలాంటి వాడు.. చాలా ఎంజాయ్ చేస్తారంటున్న కాజల్
అది సినిమాలో చూపించాలనిపించింది, టైగర్ నాగేశ్వరరావు అంటే ఒక ఎమోషన్, ఆయనకి మించిన ఎమోషన్ నేను చూడలేదని అన్నారు. నా పరిశోధనలో స్టువర్ట్ పురంలో టైగర్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను, కొంతమంది పోలీసు అధికారులని కలసి ఆయన గురించి సమాచారం సేకరించానని, అయితే టైటిల్ లో మాత్రం నిజమైన రూమర్స్ ఆధారంగా అనే వేశానని అన్నారు. దీనికి కారణం ఆయన గురించి కథలు కథలుగా వున్నాయి కానీ ఆధారాలు లేవు, రికార్డు లేదు. ట్రైన్ వేగంతో ఆయన పెరిగెత్తి రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారని చెబుతున్నా నిజంగా అది సాధ్యం కాదనిపిస్తుంది. కానీ ఆయన చేసేవాడని చెబుతున్నారు, అంతేగాక చెప్పి మరీ దొంగతనాలు చేసేవారట, ఇది వినడానికి బావుంది కానీ ఎలా చేశారనేది మనకి తెలీదు. ఇలా చాలా సంఘటనలు ఉన్నాయి కానీ దేనికీ ఆధారం లేదు. ఆయనకి సంబధించిన డాక్యుమెంట్ ఏదీ లేదు, బయోపిక్ అంటే చాలా సమాచారం దొరుకుతుంది కానీ ఆయన గురించి రాతపూర్వకంగా ఏదీ లేదు, ఇది నాకు చాలా టఫ్ గా అనిపించిందని అన్నారు. అందుకే దీనికి బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అని వేశామని అన్నారు. ఇందులో దాదాపు అన్నీ పాత్రలు రియల్ స్టువర్ట్ పురం నేపథ్యంలో వుంటాయి, 1980 నేపథ్యంలో నడిచే కథ ఇదని అన్నారు. ఆయన గురించి రీసెర్చ్ చేస్తున్న క్రమంలో చాలా అద్భుతమనిపించిన కొన్ని సంఘటనలు ఉన్నాయి, అలాంటి అద్భుతమైన సన్నివేశాలన్నీ ఇందులో ఉంటాయని ట్రైన్ సీక్వెన్స్ ని గోదావరి బ్రిడ్జి మీద తీశామని అన్నారు.