Kajal Aggarwal: బాలకృష్ణ అలాంటి వాడు.. చాలా ఎంజాయ్ చేస్తారంటున్న కాజల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal Comments about Nandamuri Balakrishna: భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కి దగ్గర పడిన క్రమంలో కాజల్ అగర్వాల్ మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో బాలకృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించిది ? అని ఆమెను అడిగితే బాలకృష్ణ చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీ అని ఆయనకు గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చాలా నిజాయితీ గల మనిషి అని ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. మా మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ ఉన్నాయని, ఆడియన్స్ వాటిని చాలా ఎంజాయ్ చేస్తారని అన్నారు. అనిల్ రావిపూడి రైటింగ్, డైరెక్షన్ స్టైల్ గురించి ? ఏమైనా చెబుతారా? అని అడిగితే అనిల్ రావిపూడి సినిమాలని చాలా ఇష్టపడతానని ఆయన టైమింగ్, సెన్స్ ఆఫ్ డైరెక్షన్ చాలా బాగుంటాయని కాజల్ చెప్పుకొచ్చారు. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలని చాలా ఎంజాయ్ చేశానని, ‘భగవంత్ కేసరి’లో ఆయన స్టైల్ వినోదం ఉంటూనే ఒక బలమైన సందేశం కూడా ఉంటుందని అన్నారు. ఇది తనకి చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుందని ఆమె అన్నారు.
Kajal Aggarwal: ‘భగవంత్ కేసరి’లో నా పాత్ర అదే.. అసలు విషయం చెప్పేసిన కాజల్
Also Read
శ్రీలీలతో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది ? అని అడిగితే శ్రీ లీల చాలా టాలెంటెడ్ అని, చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని అన్నారు. శ్రీ లీల సెట్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటుందని, మంచి పాత్రలు చేయాలనే తపన తనలో ఉందని అన్నారు. ఇందులో తాను చేసిన విజ్జి పాప పాత్ర కథలో చాలా కీలకం అని, ఖచ్చితంగా ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుందని అన్నారు. తనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని కాజల్ అన్నారు. తమన్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ తమన్ చాలా వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారని, ఇప్పటికే పాటలు చాలా పెద్ద హిట్స్ అయ్యాయని అన్నారు. ఇక ఈ సినిమాలో నేపధ్య సంగీతం చాలా గ్రాండ్ గా ఉంటుందని అన్నారు. థియేటర్లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారని అన్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాతలు హరీష్, సాహు చాలా ప్యాషనేట్ ప్రోడ్యూసర్స్ అని, ఎక్కడా రాజీపడకుండా సినిమాని చాలా గ్రాండ్ తీశారని, షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్ లో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ‘భగవంత్ కేసరి’ పవర్ ప్యాక్డ్ మూవీ అని ఎమోషన్స్, యాక్షన్ చాలా అద్భుతంగా ఉంటాయని అన్నారు. అలాగే బలమైన సందేశం కూడా ఉందని, అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని అన్నారు.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!