‘దేనికైనా రెడీ’… కానీ, ‘కండీషన్స్ అప్లై’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటన అంటే కళ. కానీ, కేవలం కళ మాత్రమే కాదు. యాక్టింగ్ అనే ఆర్ట్ కి… కొన్ని కండీషన్స్ అప్లై అవుతాయి అంటున్నారు బాలీవుడ్ స్టార్స్. సల్మాన్ మొదలు సన్నీ లియోన్ వరకూ ఒక్కొక్కరిది ఒక్కో రూల్. దాన్ని ముందుగానే తమ అగ్రిమెంట్ పేపర్స్ లో తెలియజేస్తారట. దర్శకనిర్మాతలు ఒప్పుకుంటేనే… సదరు స్టార్స్ తో సినిమా చేయగలిగేది! ఇంతకీ, ఎవరి నిబంధన ఏంటో ఓసారి చూసేద్దామా…
గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్… హృతిక్ రోషన్… డేట్స్ విషయంలో ఖచ్చితంగా ఉంటాడు. తాను కేటాయించిన వాటి కంటే ఎక్కువ రోజులు షూటింగ్ జరిగితే ఎక్స్ ట్రా వర్కింగ్ డేస్ కి ఖచ్చితంగా డబ్బులు లెక్క కట్టి ఇవ్వాల్సిందేనట! ఇక ‘క్వీన్ ఆఫ్ బాలీవుడ్’ కంగనా కూడా ఓ కీలక షరతు విధిస్తుందట సినిమా సైన్ చేసే ముందు. తన రెమ్యూనరేషన్ తాలూకూ డబ్బులు మొత్తం ఇచ్చేసి, సెటిల్మెంట్ చేసేదాకా మూవీ రిలీజ్ కాకూడదని దాని సారాంశం! ఇలాంటి నిబంధన పెట్టటం గ్లామర్ ప్రపంచంలో ఎంతైనా సబబే! ఒక్కసారి సినిమా విడుదలై హిట్టో, ఫ్లాపో తేలిపోతే ఎవరి దారిన వారు వెళ్లిపోతారు! బాక్సాపీస్ దాకా సినిమా వచ్చేశాక నిర్మాత బాకీలు చెల్లిస్తాడనుకోవటం… అమాయకత్వమే అవుతుంది!
Also Read
సల్మాన్ ఖాన్ నిజ జీవితంలో ముద్దు మురిపాలు ఎక్కువే. అయితే, అవన్నీ రియల్ లైఫ్లో. రీల్ లైఫ్లో మాత్రం ముద్దంటే వద్దంటాడు. సల్మాన్ ఇప్పటి వరకూ వెండితెర మీద ఎంగిలి పడలేదు. ఇక మీదట కూడా నో ఛాన్స్ అంటాడు, అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే! ఇక కింగ్ ఖాన్ కు హాట్ సీన్స్ విషయంలో అభ్యంతరాలు లేవు. కానీ, హార్స్ రైడింగ్ నా వల్ల కాదంటాడట! ఓసారి గుర్రపు స్వారీ చేస్తూ గాయాలపాలు కావటం వల్ల ఆయనకి ఈ రూల్ పెట్టటం తప్పటం లేదట!
బాలీవుడ్ ఖాన్స్ కే కాదు… ఖిలాడీ కుమార్ కి కూడా ఓ స్ట్రిక్ట్ కండీషన్ ఉంది. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ చేయడట. ఇంట్లో భార్యాబిడ్డలలో సంతోషంగా గడపటానికే సండే అంటాడు అక్కీ. ఫిల్మ్ మేకర్స్ కూడా స్టార్ హీరో రూల్ కి మరో మాట లేకుండా సరేనంటుంటారు!
మన దేసీ సెలబ్రిటీలే కాదు… ఫారిన్ బ్యూటీ సన్నీ కూడా ప్రతీ సినిమాకి ముందు ఓ ఆశ్చర్యకరమైన కండీషన్ పెడుతుంటుంది. ఈ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ పోర్న్ స్టార్ అలా అంటుంది అని ఎవ్వరూ ఊహించరు కూడా! ఇంతకీ, నిబంధన ఏంటంటే… సన్నీ తెర మీద కిస్ చేయదట! ఇది నిజంగా సర్ ప్రైజే కదా! కాకపోతే, ఇందులో చిన్న కిటుకు ఉంది. సన్నీ లియోన్ సినిమాలో ఎప్పుడూ కిస్ చేయనని చెప్పదు. తన తోటి నటులతో హాట్, ఇంటిమేట్ సీన్స్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ముద్దులిచ్చే ఉద్దేశం లేదట! అంటే, సన్నీ కాంట్రాక్ట్ ప్రకారం ముద్దు ముద్దే! సెక్సీ సీను సెక్సీ సీనే అన్నమాట!

తాజావార్తలు
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
-
Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
-
Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
-
Delhi: జంతర్‌మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?