హీరోయిన్స్ కి, పెట్ డాగ్స్ కి చాలా దగ్గరి సంబంధమే ఉంటుంది! ఈ మధ్య కథానాయికలు తమ పెంపుడు జంతువులు, ముఖ్యంగా, కుక్కల్ని ముద్దాడుతూ, మురిపాలు పోతూ తెగ ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారు. తమన్నా, రశ్మిక, సమంత, ఛార్మి ఇలా చాలా పేర్లే చెప్పవచ్చు. ఇక ఈ కోవలోకే వస్తుంది మన త్రిష కూడా!
Read Also: రేపు థియేటర్లలో ‘దృశ్యం -2’!
తన ఏజ్ గ్రూప్ హీరోయిన్స్ అంతా పెళ్లిల్లు చేసేసుకుని పిల్లల్ని కనేస్తున్నా త్రిష ఇంకా మూడు ముళ్లు వేయించుకోవటం లేదు. సింగిల్ గానే ఉంటోంది. అయితే, ఆమెకు ఎప్పుడూ దగ్గరగా ఉండేది మాత్రం తన పెట్ డాగ్సే! ఈ బ్యూటీఫుల్ ‘డాగ్ మామ్’ తన పసి కూనల ఫోటోలు అడపాదడపా పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇన్ స్టాలో ఓ డాగ్ పిక్ ఫాలోయర్స్ ముందు ఉంచింది! అయితే, అసలు విశేషం అంతా సదరు కుక్కతో పాటూ ఆమె రాసిన క్యాప్షన్ లోనే ఉంది…
‘ఐ లవ్ క్లింగీ బాయ్స్ ప్రొవైడెడ్… దే ఆర్ ఫోర్ లెగ్డ్’ అంటూ కాస్త కొంటెగా కొటేషన్ వదిలింది త్రిష! ఇంతకీ, దాని అర్థం ఏంటంటే… ‘అంటిపెట్టుకుని ఉండే అబ్బాయిలంటే నాకు ఇష్టం… అయితే వారికి నాలుగు కాళ్లు ఉండాల్సిందే!’ ఈ క్యాప్షన్ వెనుక సీనియర్ బ్యూటీ ఎగ్జాక్ట్ ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదుగానీ… నాలుగు కాళ్ల పెట్ డాగ్స్ తోనే ప్రస్తుతానికి త్రిష కాలం గడిపేస్తోంది. వయస్సు కూడా నలభైకి దగ్గరపడుతోంది! త్వరలో తమ ఫేవరెట్ బ్యూటీ గుడ్ న్యూస్ ఏదైనా చెబుతుందేమోనని ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు! చూడాలి మరి, ఈ ‘డాగ్ మామ్’ పెళ్లి చేసుకుని రియల్ మామ్ ఎప్పుడవుతుందో…