ఇప్పుడు డాలర్స్ రూపంలో కోట్ల రూపాయలు సంపాదిస్తోన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక జోనాస్… మొదటిసారి 5వేలు ఆర్జించిందట! ఆ డబ్బులు తన తల్లి చేతిలో పెట్టానని చెప్పింది మిస్ చోప్రా! మమాస్ గాళ్ కదా…
ప్రియాంక తన ఫస్ట్ ఎర్నింగ్స్ ని మమ్మీ చేతికి ఇస్తే దీపికా పదుకొణే నాన్న ముందు ఉంచిందట! అలా డాడీకి తన మొదటి సంపాదన అందించానని చెప్పిన డీపీ అప్పటి ఆ అమౌంట్ మాత్రం మరిచిపోయింది! డాడీస్ డాటర్ అనాల్సిందే…
సోనమ్ కపూర్ హీరోయిన్ అవ్వక ముందు సంజయ్ లీలా బన్సాలీ వద్ద అసిస్టెంట్ గా పని చేసింది. అప్పుడు ఆమె నెలసరి ఆదాయం 3వేలు. ఆ డబ్బులు రోజూ షూటింగ్ సైట్ కి వెళ్లటం, రావటం వంటి ప్రయాణాలకే సరిపోయేవట! హాట్ బ్యూటీగా తెర మీదకు రాక ముందు హార్డ్ వర్కింగ్ గాళ్ అన్నమాట…
ఆలియా భట్ మొదటి సంపాదన గురించి సరిగ్గా క్లారిటీ లేదు. కానీ, చేతిలో పెద్దగా స్వంత డబ్బులు లేనప్పుడే ఆమె తన ఓన్ మనీ మొత్తం పోగేసి ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ కొనిందట! యాంబీషియస్ గాళ్ ఆలియా…
ఆలియా బ్యాగ్ కోసం సేవింగ్స్ అన్నీ ఖర్చు చేస్తే… కంగనా ఒకప్పుడు తన వద్ద ఉన్న 50వేలు ఒకే ఒక్క డ్రస్ కోసం వాడేసిందట! తన సేవింగ్స్ మొత్తం బయటకు తీసి 50వేల రూపాయల కాస్ట్యూమ్ స్వంతం చేసుకుందట! ‘క్వీన్’ ఆల్వేస్ ‘క్వీన్’…
కల్కీ కొచ్లిన్ చదువుకునేందుకు లండన్ లో ఉండేది. అప్పుడు ఆమె వెయిట్రస్ గా పని చేస్తే 40 పౌండ్స్ వచ్చేవి. ఆ జీతాన్ని ఆమె తన అపార్ట్ మెంట్ రెంట్ కోసం ఖర్చు చేసేదట! సెల్ఫ్ మేడ్ సెన్సువల్ బ్యూటీ…
మన లిస్ట్ లో అందరికంటే చిన్న వయస్సులోనే సంపాదన మొదలు పెట్టేసింది, రిచా చద్దా! ఆమె దూరదర్శన్ లో ఒక ప్రొగ్రామ్ లో కనిపించినందుకు 2 వందల రూపాయలు, చీర బహుమతిగా ఇచ్చారట. 12 ఏళ్ల పాప ఏం చేస్తుంది? బుద్దిగా డాడీకి ఇచ్చేసింది! రిచా అప్పట్నుంచే రిచ్ అన్నమాట…
సోనాక్షి సిన్హా ఫస్ట్ మూవీ సల్మాన్ ఖాన్ స్టారర్ ‘దబంగ్’. అప్పుడు ఆమెకు లభించిన రెమ్యూనరేషన్ సల్మాన్ నడిపే ‘బీయింగ్ హ్యూమన్’ సంస్థకి విరాళంగా ఇచ్చేసిందట! సో గార్జియస్, సో జెనరస్, సోనాక్షి…
విద్యా బాలన్ తొలి సంపాదన 5 వందల రూపాయలు! ఇంతకీ, ఆ డబ్బులు ఆమెకు ఎందుకు వచ్చాయనుకుంటున్నారు? సింపుల్ గా అలా నవ్వుతూ నిలుచున్నందుకు! ఈ విషయం ఆమే చెప్పింది. ప్రభుత్వం నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో విద్యాతో పాటూ ఆమె సోదరి, మరో ఇద్దరూ కలసి ‘సింపుల్ గా స్మైల్ చేస్తూ చెట్టు పక్కన నిలుచున్నారట’! సీన్ కట్ చేస్తే ఒక్కొక్కరికి 5 వందలు ఖాతాలో పడ్డాయి! లావైతేనేమీ… లాఫింగ్ తో సత్తా చాటింది… వెర్సటైల్ విద్యా!