రానా విడుదల చేసిన ’11:11′ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా, వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా రాబోతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ’11: 11′. కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీకీలకపాత్రల్లో నటిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా ’11: 11′ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఒక నిమిషం రెండు సెకనుల నిడివితో ఉన్న ఈ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్‌లో కేవలం మూడు క్యారెక్టర్స్ చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. హీరో రాజీవ్ సాలూర్- హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం లాంటి సీన్స్ ఈ వీడియోలో కనిపించాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌కి తోడు మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి.
Also Read
గతంలో ఈ ’11: 11′ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసి చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు మోషన్ పోస్టర్ విషయంలో రానా సపోర్ట్ దొరికింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించాలని రానా కోరుకున్నారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్‌డేట్స్ ప్రకటించనున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!