IT Notes:బాలాపూర్‌లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశించిన బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతనర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే పారిజాతనర్సింహారెడ్డి ఇంట్లో ఇవాళ సోదాలు ముగిసాయి.
శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండగ అక్కాతమ్ముళ్లు అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని చాటి చెప్తుంది. రక్ష బంధన్ వేడుకల్లో మంత్రి సబితమ్మ పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోదరుడు నరసింహ్మ రెడ్డి ఇంటికెళ్లి రాఖీ కట్టారు. సోదరుడు నరసింహ్మ రెడ్డికి స్వీటును తినిపించారు మంత్రి. సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అక్కా- తమ్ముళ్ల, అన్న- చెల్లెళ్ళ వెల కట్టలేని ప్రేమానురాగాలు,…
అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు. తమను ఎవరేం చేయలేరన్న అహంకారంతో రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. సామాన్య ప్రజలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే తాజా ఘటన! సహాయం చేసిన వ్యక్తినే ఓ ఎస్సై విచక్షణారహితంగా కొట్టాడు. ఆ వ్యక్తి తప్పేం లేదు. ఒక సమస్యని పరిష్కరించి, కాస్త ఆలస్యంగా వచ్చాడంతే! దీంతో ఆలస్యంగా వస్తావా అంటూ.. ఆ వ్యక్తిపై ఎస్సై దాష్టీకానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి చౌటకూర్ మండలం శివ్యంపేటలో…
షర్మిళ పార్టీ కార్యాలయంలో పదవుల కేటాయింపు పై రభస జరిగింది. షర్మిల పార్టీలో పదవులు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు దేవరకద్రకు చెందిన నర్సింహారెడ్డి. పార్టీ పదవులు 5 లక్షలకు అమ్ముకుని రాత్రికి రాత్రే పేర్లు మార్చేసారని వ్యాఖ్యలు చేసిన నర్సింహారెడ్డి… షర్మిళని వ్యతిరేకించడం లేదు, పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. నేను ఎప్పటి నుండో పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నా. ముక్కు మొహం తెలియని వారికి పదవులు ఇచ్చారు. పార్టీలో ఎవరు ఎవరు సీట్లు అమ్ముకున్నారో…
ప్రముఖ యాంకర్ శ్యామల భర్త, బుల్లితెర నటుడు నరసింహారెడ్డి మంగళవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఖాజాగూడకు చెందిన సింధూర రెడ్డి అనే మహిళ నరసింహారెడ్డి తన దగ్గర కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన నరసింహ రెడ్డి ఈ విషయంపై స్పందించిన వీడియోను శ్యామల తన ఇన్స్టాగ్రామ్…