YS Sharmila: బీఆర్‌ఎస్ పై ప్రతిపక్షాలు పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ వైఎస్‌ఆర్ పార్టీలు ముకుమ్ముడి బీఆర్‌ఎస్ పై దాడి చేసేందుకు ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారు. ఒక్కొక్కొరిగా ప్రశ్నిస్తే న్యాయం జరగదని భావించిన నేతలు, అందరూ కలిసి ఏకమై బీఆర్‌ఎస్ ను ప్రశ్నించేందుకు చేయి చేయి కలుపనున్నారు. దీనికి నిదర్శనమే తాజాగా వైఎస్ షర్మిల.. బండి సంజయ్ , రేవంత్ రెడ్డికి ఫోన్ చేయడం కలకలం రేపుతుంది. ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని పిలుపు నివ్వడంతో తాజా రాజకీయ పరిణామాలు వేడక్కనున్నాయి.
Read also: Ashok Gehlot : ఖలిస్తాన్‌పై అమృతపాల్ ధైర్యం అదే.. కారణం చెప్పిన రాజస్థాన్ సీఎం
నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని తెలిపారు. ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని వైఎస్ షర్మిల సూచించారు. కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని కోరారు. కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కేసీఆర్ బ్రతకనివ్వడు అంటూ తెలిపారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. త్వరలో సమావేశం అవుదామని బండి సంజయ్ చెప్పినట్లు షర్మిల అన్నారు. అంతేకాకుండా.. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడింది రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీతో చర్చించి నిర్ణయం తీసుకుందామని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రగతి భవన్ మార్చ్ కు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ ఈ మూడు పార్టీలు ఏకమైతే అనుహ్యమైన పరిణామాలు ఎదురవుతాయని, అసలు ఈ మూడుపార్టీలు నిజంగానే కలుస్తాయా? ఇప్పుడే ప్లక్సీలు, హోర్డింగ్ లతో విమర్శలు చేసుకుంటూ జిల్లాల్లో రచ్చ రేగుతుంటే ఇప్పుడు మూడు పార్టీలు ఏకమై ప్రశ్నించేందుకు సిద్దమవతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడెక్కుతోంది.
Flexi War: రాష్ట్రంలో రాత్రికి రాత్రే వెలుస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగులు.. అయోమయంలో ప్రజలు