Site icon NTV Telugu

YS Sharmila: రఘునందన్ పై వైఎస్‌ షర్మిల ఫైర్‌

Sharmila1

Sharmila1

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఫైర్ అయ్యారు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.. 6 ఏళ్లుగా కేసీఅర్ దుబ్బాక ప్రజలకు చెవిలో పూలు పెడితే…బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాడు.. మల్లన్న సాగర్ బాధితులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇచ్చిన హామీ నెరవేర్చారా..?11 గ్రామాల ప్రజలకు అన్యాయం జరిగిందని నేను న్యాయం చేస్తా అని రఘునందన్ రావు చెప్పాడట. రెండింతలు పరిహారం ఇప్పిస్తాం అన్నాడట.. పరిహారం ఇప్పించక పోతే 6 నెలల్లో రాజీనామా చేస్తా అన్నాడట.. పరిహారం రాలేదు…రాజీనామా చేయలేదన్నారు షర్మిల.

Read Also: Fake Currency Gang Busted: మైలార్ దేవ్ పల్లిలో ఫేక్ కరెన్సీ గుట్టురట్టు

ఎన్నికల్లో దుబ్బాక లో కుటుంబ సభ్యులతో ఆసుపత్రి కడతాం అన్నారు. కట్టింది దుబ్బాక లో కాదు…అమీర్ పేటలో …అది ఉచితం కాదు.. దోచుడే అంటున్నారు. ఆ ఆసుపత్రి ప్రారంభానికి మంత్రి హరీష్ రావు వచ్చారట.. ఈయన బీజేపీ లో ఉన్నట్లా… TRS ఉన్నట్లా.. బీజేపీ కండువా కప్పుకున్న TRS నాయకుడు రఘునందన్ రావు.. వైఎస్సార్ గురించి రఘునందన్ రావు అన్నాడట. పావురాల గుట్టలో పావురంలా కలిసి పోయాడని..ఈ ఎమ్మెల్యే కి వార్నింగ్ ఇస్తున్నాం.. వైఎస్సార్ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

మరోవైపు షర్మిలపై ఎస్సీఎస్టీ కేసు నమోదైంది. ఆందోల్ ఎమ్మెల్యే, ఆయన తమ్ముళ్లు అవినీతి కబ్జాలకు పాల్పడుతున్నారని సొంత తండ్రే చెప్పారు. నేను అదే చెప్పాను..మరి మీ తండ్రిపై కూడా కేసు పెడతారా అని షర్మిల అన్నారు. దళిత ఎమ్మెల్యే అవినీతి చేస్తే ప్రశ్నించవద్దని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది. మంత్రి నిరంజన్ రెడ్డి నన్ను మంగళవారం మరదలు అన్నాడు.. ఎవడ్రా నువ్వు అంటే నాపై కేసు పెట్టారన్నారు.

Read Also: Satyakumar: కేసీఆర్‌కు సవాల్.. ఒక్క బీజేపీ కార్యకర్తను లాక్కోగలిగినా ముక్కు నేలకు రాస్తా..!!

Exit mobile version