Telangana: వైఎస్ షర్మిల ఫైర్.. కేసీఆర్‌కు సీఎం పదవి అవసరమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి హాట్ కామెంట్లు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చొడులో మాటా ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు అంటూ ఫైర్ అయ్యారు.. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చీమకుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అని ఆరోపించిన ఆమె.. ప్రతి చివరి గింజ కొనుగోలు చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్, రైతు పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఢిల్లీలో ధర్నాలతో డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు.
Read Also: AAP: ఆమ్ఆద్మీలో కొత్త జోష్.. ఆ పార్టీ గూటికి కీలక నేత..
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ఏ ప్రభుత్వంలో నైనా నేను చెప్పిన పంట వేయాలి అనే హక్కు పాలకులకు ఎక్కడైనా ఉందా…? అంటూ నిలదీశారు వైఎస్ షర్మిల… మద్దతు ధర ఉన్న పంట పండించకపోతే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏ పని చేసి బతకాలి..? అని ప్రశ్నించిన ఆమె.. పండించిన పంటను కొనుగోలు చేయకుండా రైతుల్ని హింసిస్తున్న కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి అవసరమా…? అంటూ మండిపడ్డారు. ఆనాడు కులమత బేధాలు పార్టీల కతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందన్న ఆమె.. ఖమ్మం జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు పోడు భూములకు గిరిజనులకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అని గుర్తుచేశారు.. ఇప్పుడు పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా గిరిజన మహిళలు, చంటిపిల్ల తల్లులపై కేసులు బనాయించి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందని ఎద్దేవా చేశారు.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేని సమయంలో ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని.. రాజన్న బిడ్డగా మీ ముందుకు వచ్చా నన్ను ఆశీర్వదించండి మళ్లీ రైతు రాజ్యాన్ని తీసుకవస్తానని ప్రకటించారు వైఎస్ షర్మిల.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!