బంగారు తెలంగాణలో పెంచని చార్జీలు లేవు.. వారిని కూడా వదలడంలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వరుసగా అన్ని చార్జీలు పెరుగుతుండడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాజాగా విద్యుత్ చార్జీల పెంపుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె.. సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.. వైఎస్ఆర్ హయాంలో ఏ రోజు కూడా ఆర్టీసీ చార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, విద్యుత్ చార్జీలు కానీ పెరిగింది లేదని ట్వీట్లో పేర్కొన్న ఆమె.. బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవంటూ మండిపడ్డారు.. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచి, ఇప్పుడు కరెంటు చార్జీల భారం మోపారని ఆరోపించారు. 50 యూనిట్ల లోపు వాడుకునే 40 లక్షల పేదలను కూడా వదలకుండా ముక్కు పిండి చార్జీలు వసూలు చేస్తున్నాడని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఇక, ఏడాదికి 6,800 కోట్ల లోటును పూడ్చుకునేందుకు సామాన్యుడిపై కరెంట్ భారాన్ని మోపారంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు వైఎస్ షర్మిల.. దూకుడు ఖర్చులకు, దొర పోకడలకు, తెచ్చిన అప్పుల మీద మిత్తికి మిత్తి.. ప్రజల నుంచే వసూలు చేస్తున్నారని ఆరోపించిన ఆమె.. జనానికి కరెంట్ షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి షాక్ ఇచ్చేందుకు ప్రజలు రెడీగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
Also Read
YSR హయాంలో ఒక్కరోజు కూడా
RTC చార్జీలు కానీ, కరెంట్ చార్జీలు కానీ,
హౌస్ టాక్స్ లు కానీ పెరిగింది లేదు.
కేసీఆర్ గారు బంగారు తెలంగాణలో పెంచని చార్జీలు లేవు.
మొన్న RTC ఛార్జీలు, ఇవాల కరెంట్ ఛార్జీలు.
50 యూనిట్ల లోపు వాడుకొనే 40 లక్షల పేదవాళ్లను కూడా వదలకుండా
ముక్కు పిండి 1/2— YS Sharmila (@realyssharmila) December 28, 2021
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!