NTV Telugu Site icon

YS Sharmila: కేసీఆర్‌ జోక్‌ బాగుంది.. బంగారు తెలంగాణ ఎక్కడుంది..?

కేసీఆర్‌ ఇంత కాలం బూతులే మాట్లాడుతారు అనుకున్నా.. ఇప్పుడు జోకులు కూడా బాగానే చెబుతున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. హైదరాబాద్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రైతు బతికినంత వరకు రైతే అన్నారు.. రైతు అంటే నిర్వచనం ఏంటి? అని ప్రశ్నించిన ఆమె.. 66 లక్షల మంది రైతులు ఉంటే 41 లక్షల మంది రైతులకే రైతుభీమా ప్రీమియం ప్రభుత్వం కడుతుందని.. మిగతా 25 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు.. రైతు ఎప్పుడు చనిపోయినా రైతుబీమా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేసిన ఆమె.. రైతుల వయస్సే అడ్డువస్తే.. ఎల్ఐసీ ఇన్సూరెన్స్ కాకుండా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అవకాశం ఇవ్వాలని సూచించారు.. కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. కౌలు రైతును గుర్తించాలనే మనస్సు కేసీఆర్ కి లేదని ఫైర్‌ అయ్యారు..

Read Also: TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం టికెట్లపై కీలక నిర్ణయం

ఇక, కేసీఆర్ జోకులు బాగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు వైఎస్‌ షర్మిల.. కేసీఆర్‌ చెబుతున్న బంగారు తెలంగాణ ఎక్కడ ఉంది? అని నిలదీసిన ఆమె.. మద్యం ఏరులై పారుతుంది.. బడులు ఎక్కువ ఉన్నాయా? బార్లు ఎక్కువగా ఉన్నాయా? అని ప్రశ్నించారు.. బంగారు తెలంగాణ కాదు, తాగుబోతుల తెలంగాణ.. ఆత్మహత్యల తెలంగాణ, అప్పుల తెలంగాణ, బానిసత్వపు తెలంగాణ, ఇది బతుకులేని తెలంగాణ అంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ షర్మిల. మొన్నటి వరకు మహిళా కమిషన్ లేదు? మహిళా మంత్రి లేరు? మహిళలకు గౌరవం లేదన్న ఆమె.. ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగిన కేసీఆర్.. ఇప్పుడు ప్రగతి భవన్ టక్కు, టమారాం అయ్యింది.. ప్రగతి భవన్‌లో బంగారం పేర్చుకున్నారు కావొచ్చు.. ఆయన కుటుంబం బంగారు కుటుంబం అయ్యింది.. కానీ, తెలంగాణ బంగారం కాలేదు.. బొందల తెలంగాణగా మారిందన్నారు.. ఈ దరిద్రం ఇక్కడితో చాలు.. దేశం మొత్తం వద్దు అని సూచించారు. మరోవైపు.. ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోయే దాన్ని కాదన్నారు షర్మిల.. లొంగిపోయే దాన్ని కాదన్నారు.. ఇక, తెలంగాణను మళ్లీ ఏపీలో కలపడం సాధ్యం కాదన్న ఆమె.. బీజేపీ, ఎంఐఎం మతత్వం గురించి మాట్లాడుతుంటే, కేసీఆర్, కేటీఆర్ లు తెలంగాణ సెంటిమెంటును వాడుకుంటున్నారన్నారు.