Viral Tiktok: వీడు మాములోడు కాదు… పోలీస్ వెహికల్ లోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో యువత దేనినీ వదలడం లేదు. మంచి చెడు అనేది పక్కన పెట్టి పాపులారిటీకి పడిచచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. కాస్త ఖాళీ టైం దొరికితే చాలు టిక్ టాక్ వీడియోలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఒక్కోసారి ఈ వీడియోలు వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు చేసిన పని పోలీసులకు తలనొప్పిగా మారింది. అది కూడా వాడు చేసింది మామూలు విషయం కాదు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే మీరు షాకవ్వక తప్పదు.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు పోలీసులు వాడే రక్షక్ వాహనాన్నే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పోలీస్ వాహనాన్ని వాడి టిక్ టాక్ వీడియోస్ చేసి పారేశాడు. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోకిరీ చేసిన టిక్ టాక్ వైరల్ అవుతోంది. ఓ పార్కింగ్ స్థలంలో నిలిపి ఉన్న పోలీస్ పెట్రోల్ వాహనంలో టిక్ టాక్ చేశాడు ఆ యువకుడు. అంతవరకూ బాగానే వుంది. అచ్చం పోలీస్ ఆఫీసర్ వెహికల్ డోర్ తీసుకుని దిగినట్టుగా అలాగే దిగుతూ టిక్ టాక్ వీడియోలకు పోజిచ్చాడు. చేతిలో రివాల్వర్ ఆపై డోర్ తీస్తూ వాకింగ్ చేస్తూ టిక్ టాక్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు పోలీసులు. అక్కడ సీసీ కెమేరాలు వున్నాయో లేవో, ఈ వీడియోలోని యువకుడిని గుర్తుపట్టి అతడిపై చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. సిటీ పోలీసులు ఎప్పటికి స్పందిస్తారో చూద్దాం. ఈ యువకుడి చేతిలో రివాల్వర్ సంగతేంటో చూడాలంటున్నారు జనం.
Also Read
Viral: లైవ్ లోనే చెంపచెల్లుమనిపించిన లేడీ జర్నలిస్ట్.. వీడియో వైరల్
తాజావార్తలు
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!