NTV Telugu Site icon

Viral Tiktok: వీడు మాములోడు కాదు… పోలీస్ వెహికల్ లోనే..

Viral

Viral

ఈ మధ్యకాలంలో యువత దేనినీ వదలడం లేదు. మంచి చెడు అనేది పక్కన పెట్టి పాపులారిటీకి పడిచచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. కాస్త ఖాళీ టైం దొరికితే చాలు టిక్ టాక్ వీడియోలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఒక్కోసారి ఈ వీడియోలు వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు చేసిన పని పోలీసులకు తలనొప్పిగా మారింది. అది కూడా వాడు చేసింది మామూలు విషయం కాదు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే మీరు షాకవ్వక తప్పదు.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు పోలీసులు వాడే రక్షక్ వాహనాన్నే తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పోలీస్ వాహనాన్ని వాడి టిక్ టాక్ వీడియోస్ చేసి పారేశాడు. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోకిరీ చేసిన టిక్ టాక్ వైరల్ అవుతోంది. ఓ పార్కింగ్ స్థలంలో నిలిపి ఉన్న పోలీస్ పెట్రోల్ వాహనంలో టిక్ టాక్ చేశాడు ఆ యువకుడు. అంతవరకూ బాగానే వుంది. అచ్చం పోలీస్ ఆఫీసర్ వెహికల్ డోర్ తీసుకుని దిగినట్టుగా అలాగే దిగుతూ టిక్ టాక్ వీడియోలకు పోజిచ్చాడు. చేతిలో రివాల్వర్ ఆపై డోర్ తీస్తూ వాకింగ్ చేస్తూ టిక్ టాక్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు పోలీసులు. అక్కడ సీసీ కెమేరాలు వున్నాయో లేవో, ఈ వీడియోలోని యువకుడిని గుర్తుపట్టి అతడిపై చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. సిటీ పోలీసులు ఎప్పటికి స్పందిస్తారో చూద్దాం. ఈ యువకుడి చేతిలో రివాల్వర్ సంగతేంటో చూడాలంటున్నారు జనం.

Viral: లైవ్ లోనే చెంపచెల్లుమనిపించిన లేడీ జర్నలిస్ట్.. వీడియో వైరల్