Bike racing: బైక్ రేస్ … యువత రయ్ రయ్ మంటూ రోడ్లమీద దూసుకుపోతారు. ఖరీదైన బైక్ లు రోడ్ల మీద విన్యాసాలు చేస్తాయి. సోషల్ మీడియా లైక్ ల కోసం బైక్ పై వెర్రి వేషాలు వేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. బైక్ రేస్ ల సంస్కృతి వల్ల యువకులు పాడైపోతున్నారని, ప్రాణాల మీదకి తెచ్చుకుని కన్నవారికి శోకం మిగులుస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా యువత పట్టించుకోవడం లేదు. యువకులు నిత్యం రోడ్డుపై హంగామా సృష్టిస్తున్నా.. ట్రాఫిక్ పోలీసులు మాత్రం చలాన్లకే పరిమితం చేస్తున్నారు. అయితే తాజాగా నగరంలో బైక్ రేసింగ్ ఆగడాలు మితిమీరాయి. రాత్రి మలక్ పేట, చంచల్ గూడ ప్రాంతాల్లో బైక్ రేసింగ్ అలజడి సృష్టించింది. దీంతో నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Read also: Mahabubnagar Crime: కల్తీకల్లు వ్యవహారంలో వెలుగులోకి సంచలన విషయాలు
మలక్ పేట, చంచల్ గూడ ప్రాంతాల్లో బైక్ రేసింగ్ లతో యువకులు రెచ్చిపోయారు. కొంతమంది యువకులు సాయంత్రం, తెల్లవారుజామున రేసింగ్‌లు చేస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అత్యంత వేగంతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని లైక్ ల కోసం యువత తమ బాధ్యతగా మైన జీవితాన్ని పనంగా పెట్టి విన్యాసాలు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. యువకులు 100 నుండి 150 కి.మీ వేగంతో అత్యంత వేగంగా రోడ్లపై స్పీడ్ పెంచి సైటెన్సర్ తో విపరీతమైన సౌండ్ లు చేస్తూ వాహనదారులకు, ప్రజలకు భయాందోళనకు గురిచేస్తున్నారు. బైక్ నడుపుతున్న వారందరూ మైనర్లు ఉండటం గమనార్హం. బైక్ నడుపుతున్నవారికి 18 ఏళ్లు కూడా నిండినట్లు లేదని, వారంతా మైనర్ బాలురు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వారందరూ బైక్ ను 150 స్పీడ్ తో నడుపుతూ వాహనదారులకు భయభ్రాంతులకు గురి చేస్తుంన్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ తరహా సంస్కృతికి చెక్ పెట్టాలని, మలక్ పేట, చంచల్ గూడ ప్రాంతాల్లో బైక్ రేసింగ్ లతో వెళ్ళే ప్రాంతాల్లో నిఘా ఉంచాలని కోరుతున్నారు. రాత్రి సమయంలో సౌండ్స్ రావడంతో నిద్రలేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా బైక్ లు నడిపే వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Hyderabad Traffic : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ దారుల్లో వెళ్తే అంతే సంగతి..