Hyderabad: బీజేపీ దిగ్గజాలకు నేడు యాదమ్మ చేతి వంటకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు బీజేపీ దిగ్గజాలు ఈరోజు తెలంగాణ వంటకాల రుచి చూడబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలను ఆయా ప్రముఖులంతా టేస్ట్ చేయబోతున్నారు. భోజనంతోపాటు స్నాక్స్ సైతం తెలంగాణ స్టైలులోనే తయారు చేస్తున్నారు. స్వీట్స్ సైతం తెలంగాణ తినుబండారాలనే వడ్డిస్తుండటం విశేషం. స్వీట్స్ సహా దాదాపు 50 రకాల వంటకాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు రోజైన ఆదివారం మధ్యాహ్నం అతిరథ మహారథుల కోసం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ స్వయంగా యాదమ్మ చేతితోనే చేస్తుండటం గమనార్హం.
బీజేపీ దిగ్గజాలు టేస్ట్ చేయబోయే వంటకాల జాబితా
చిక్కుడుకాయ టమోటా, ఆలు కూర్మ, వంకాయ మసాలా కర్రీ, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ కాజు పల్లీల ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, గంగవాయిలకూర, మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగార, పులిహోర, పుదీనా రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీ
Also Read
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
స్వీట్స్ జాబితా
బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, భక్షాలు, బూరెలు, అరిసెలు
స్నాక్స్
పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, మిర్చి
ఎవరీ యాదమ్మ?
యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం. 15వ ఏటనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో కరీంనగర్ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఆహా అనకుండా ఉండలేరని చెబుతారు.
- Tags
తాజావార్తలు
-
Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!