హైద్రాబాద్‌పై బీజేపీ కుట్ర చేస్తుందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ, కేంద్రం పై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తామని తెలంగాణ పసుపు రైతులను మోసం చేశారన్నారు. ఆయనకు చేతనైతే వెంటనే పసుపు బోర్డుపై కేంద్రంతో మాట్లాడి తీసుకురావాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ఇష్టానుసారం మాట్లాడుతుందన్నారు.
తెలంగాణ మంత్రులు ఢీల్లీకి వెళ్లిన కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, తెలంగాణ ప్రజలపై వివక్షా పూరిత ధోరణిని బీజేపీ అవలంభిస్తుందన్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు పై కేంద్రం తేల్చాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులపై కేంద్రం కక్ష కట్టిందన్నారు. బీజేపీ ఎంపీలు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. వారు ఏంమాట్లాడుతున్నారో వారికే తెలియదన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలన్నారు. బీజేపీ వరి ధాన్యం విషయంలో అనవసర సమస్యలను సృష్టిస్తుందని బాల్క సుమన్ అన్నారు.