తునికాకు సేకరణ కోసం అడవిలోకి వెళ్లి మిస్ అయిన మహిళ ఆచూకీ లభించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సుబ్బక్కపల్లికి చెందిన బండారు శిరీష గత రెండు రోజుల క్రితం తునికాకు సేకరణకు వెళ్లి అడవిలో వెళ్లింది. అయితే ఆమె కనిపించకుండా పోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ కెమెరా తో గాలింపు చేపట్టారు. ఈరోజు ఉదయం భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి శివారు అడవి ప్రాంతంలో పోలీసులు ఆమెను గుర్తించారు. నీరసంగా ఉండడంతో భూపాలపల్లి ఏరియా…
భారీవర్షాలతో బురదమయంగా మారాయి తిరుపతిలోని రోడ్లు. ఎల్ బీ నగర్ వీధిలో బురదను తొలగించారు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషా. వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే భూమన. అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకు పాగుతున్నారు. మరోవైపు వరద బాధితులకు తనవంతు సాయం అందిస్తున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వరద ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు పంపిణీ చేసేందుకు నేవీ హెలికాప్టర్లో సరుకులను పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.