NTV Telugu Site icon

Gym Trainer: జిమ్ కొచ్చిన అమ్మాయిపై కన్నేసిన కోచ్.. కోరిక తీరగానే కాదు పొమ్మన్నాడు

Gym Triner

Gym Triner

Gym Trainer: వ్యాయామం, బాక్సింగ్ శిక్షణ పేరుతో కండలు తిరిగిన ఓ యువకుడు ఓ యువతిపై కన్నేశాడు. కొంతకాలంగా జిమ్‌కు వచ్చిన యువతితో బాగా ప్రవర్తించిన కమంధుడు ఆమెను లొంగదీసుకుని ఎంజాయ్ చేసేందుకు స్కెచ్‌ వేసింది. ప్రేమ పేరుతో ఆమెను వెంబడించాడు. ఆమెకు నమ్మకం కలిగే వరకు అతను ఆమె చుట్టూ తిరిగాడు. యువతి అతడిని నమ్మి చివరకు ప్రేమను ఒప్పుకుంది. ఇదే కలను అనుకున్న జిమ్ ట్రైనర్ కోరిక తీర్చుకున్నాడు. కొన్ని రోజులు ఇలాగే కొనసాగాడు. అయితే ఆ యువతి పెళ్లి విషయం ప్రస్తావనకు రావడంతో రెచ్చిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో చోటుచేసుకుంది.

Read also: VD12: గౌతమ్ తిన్ననూరి -దేవరకొండ మూవీ షూట్ మొదలు

అసిమ్ (25) అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా టోలిచౌకిలో జిమ్ నడుపుతున్నాడు. ఏడాది క్రితం అదే ప్రాంతంలో నివాసముంటున్న ఓ యువతి జిమ్‌లో చేరింది. ఆమెను గమనించిన జిమ్ ట్రైనర్‌తో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో అసిమ్ వెంటబడి వేధించాడు. చివరకు అతడిని నమ్మిన యువతి అతడి ప్రేమను అంగీకరించింది. దీంతో జిమ్ ట్రైనర్ ఆమెపై తన కోరిక తీర్చుకున్నాడు. అయితే ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో అసిమ్ అసలు రహస్యం బయటపడింది. అతను యువతితో ఆకట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అసిమ్‌ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో నమ్మించి తనని లొంగదీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని కోరింది. కాగా ఫిలింనగర్ పోలీసులు నిందితులపై ఐపీసీ 376, 417, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిమ్ ట్రైనర్ ఇంతకు ముందకూడా అమ్మాలను ఇలాగే ట్రాప్ చేసి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జిమ్ ట్రైనర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
VD12: గౌతమ్ తిన్ననూరి -దేవరకొండ మూవీ షూట్ మొదలు