వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.
Hyderabad: హైదరాబాద్ హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించి టోలిచౌకీలో రెండు గుంపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గోల్కొండకు చెందిన షకీల్ కొంతమంది వ్యక్తులతో కలిసి టోలిచౌకీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అక్తర్ ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం అందిందని డీఐ బాలకృష్ణ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, ప్రాథమిక విచారణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తప్ప గన్…
Gym Trainer: వ్యాయామం, బాక్సింగ్ శిక్షణ పేరుతో కండలు తిరిగిన ఓ యువకుడు ఓ యువతిపై కన్నేశాడు. కొంతకాలంగా జిమ్‌కు వచ్చిన యువతితో బాగా ప్రవర్తించిన కమంధుడు ఆమెను లొంగదీసుకుని ఎంజాయ్ చేసేందుకు స్కెచ్ వేసింది.
తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.. అయితే.. మొదట ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో మాత్రం టెన్షన్ నెలకొంది.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి మెడికల్ టీమ్‌లు… కాంటాక్టుల్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో.. ఆ ప్రాంతంలో మరింత…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హైదరాబాద్‌లో ఎంటరైంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్టు తెలంగాణ వైద్య శాఖ ప్రకటించింది.. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించడం.. వారికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఎంట్రీతో అప్రమత్తం అయ్యారు అధికారులు.. ఇక, ఆ ఇద్దరూ మొహిదీపట్నం టోలీచౌకీ ప్రాంత వాసులే కావడంతో.. ఆ…