Site icon NTV Telugu

Hyderabad Crime: హైదరాబాద్‌లో విషాదం.. భర్త మరణాన్ని భరించలేక..

Woman Commits Suicide

Woman Commits Suicide

Woman Commits Suicide After Demise Of Her Husband In Hyderabad: హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. డీడీ కాలనీకి చెందిన సాహితికి (29) ఏడాదిన్నర క్రితం వనస్థలిపురంకు చెందిన మనోజ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో వివాహం జరిగింది. వీళ్లిద్దరు అమెరికాలోని డల్లాస్‌లో సెటిల్ అయ్యారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. పెళ్లయ్యాక ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా పెరిగింది. ఒకరికి మరొకరు అంటే ఎంతో ఇష్టం.

VC Sajjanar: ప్రజల్ని మోసం చేసిన ఆ సంస్థని ప్రమోట్ చేయొద్దు.. ఐపీఎల్ యాజమాన్యంకు సజ్జనార్ రిక్వెస్ట్

కట్ చేస్తే.. సాహిత ఈ నెల 2వ తేదీన తన తల్లిదండ్రుల్ని చూసేందుకు ఇండియాకి తిరిగొచ్చింది. డీడీ కాలనీలో ఉంటున్న తన పేరెంట్స్ ఇంటికి వెళ్లింది. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మనోజ్, సాహితి ఫోన్‌లో మాట్లాడునేవారు. అయితే.. 20వ తేదీన మనోజ్ గుండెపోటుతో మృతిచెందాడు. 23వ తేదీన అతని మృతదేహం ఇండియాకి వచ్చింది. అశ్రునయనాల మధ్య 24వ తేదీన మనోజ్ అంత్యక్రియల్ని జరిపారు. ఆ తర్వాత సాహితి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. తన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న బాధలోనే ఉండిపోయింది. అదే రోజు రాత్రి సాహితి తన చెల్లెలు సంజన రూమ్‌లో కలిసి పడుకుంది.

Raghunandan Rao: ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలి

గురువారం ఉదయం 09:20 గంటల సమయంలో సంజన వాష్‌రూమ్‌‌ కోసమని రూమ్ నుంచి బయటకు వెళ్లింది. 10 నిమిషాల తర్వాత తిరిగొచ్చి చూస్తే.. లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా సాహితి నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో.. అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా, సాహితి చీరతో ఫ్యాన్‌కి ఉరి వేసుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సాహితి ఆత్మహత్యతో.. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంగఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version