NTV Telugu Site icon

Siddipet: ట్రాన్స్ జెండర్ గా మారి వేధించిన భర్త.. సుపారి ఇచ్చి చంపించిన భార్య

Roja Hijra

Roja Hijra

Siddipet: సిద్దిపేటలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్త హిజ్రాగా మారి వేధిస్తుండటంతో భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఘటన కలకలం రేపింది.. గత నెలలో జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. 2014లో సిద్దిపేట బోయిగల్లికి చెందిన వేదశ్రీ అనే మహిళకు నసరపుర వీధికి చెందిన దరిపల్లి వెంకటేష్‌తో వివాహమైంది. వారికి ఒక పాప ఉంది. వెంకటేష్ అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కానీ వెంకటేష్ ప్రవర్తనలో క్రమంగా మార్పు రావడంతో హిజ్రాగా మారి రోజాగా పేరు మార్చుకున్నాడు. గత ఏడేళ్లుగా మనస్పర్థలు రావడంతో ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. అయితే తన కూతురిని తనకు అప్పగించాలంటూ వేదశ్రీని రోజా వేధించేది. దీంతో కొంతకాలంగా సన్నిహితంగా మెలిగిన సిద్దిపేటకు చెందిన బోయిని రమేష్ తో కలిసి రోజాను హత్య చేయాలని వేదశ్రీ నిర్ణయించుకుంది. బోయిని రమేష్‌తో వేదశ్రీ హత్యకు ప్లాన్ చేసింది.

Read also: Ram Mandir Inauguration: రామమందిర్ ట్రస్ట్‌కు రూ.11 కోట్లు విరాళం.. చెక్కును అందజేసిన శ్రీకాంత్ షిండే

రూ.18 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోగా రెండు విడతలుగా రూ.4.60 లక్షలు చెల్లించింది. గతేడాది డిసెంబర్ 11న నసర్‌పురాలోని తన ఇంట్లో రోజా ఒంటరిగా హత్యకు గురైంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన రమేష్ స్నేహితుడు ఇప్పల శేఖర్ రోజాతో కలిసి మద్యం సేవించాడు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టంలో హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అన్ని కోణాల్లో విచారించగా వేదశ్రీతో పాటు మరో ఐదుగురి పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయింది. శనివారం సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు నిందితురాలు వేదశ్రీతో పాటు ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. వేదశ్రీ, బోయిని రమేష్, ఇప్పల శేఖర్‌లను శనివారం అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
Top Headlines @ 9AM: టాప్‌ న్యూస్‌!