Congress First List: కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్.. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి జాబితాలో 55 మందికి స్థానం కల్పించారు. బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్ ఖాయమైంది. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి, ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి కూడా టికెట్ దక్కించుకున్నారు. కోదాడ నుంచి ఉత్తమ్ హుజూర్ నగర్, పద్మావతి బరిలోకి దిగుతున్నారు. భద్రాచలం టికెట్ కమ్యూనిస్టులకే కేటాయిస్తారని ప్రచారం జరిగినా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యకు టికెట్ ఖరారు చేసింది.
నాగార్జున సాగర్ బరిలో ఈసారి జానారెడ్డి బదులు ఆయన కుమారుడు జయవీర్ బరిలోకి దిగనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొండగల్ నుంచి, ఎంపీ కోమటిరెడ్డి నల్గొండ నుంచి, భట్టి వికమార్క మధిర నుంచి పోటీ చేయనున్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై తూమకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. జగిత్యాల నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. వామపక్షాలతో పొత్తులో భాగంగా సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం స్థానాలు ఖరారైన సంగతి తెలిసిందే. సీపీఎంతో చర్చలు జరిపి పొత్తు తెంచుకున్న తర్వాత మిగిలిన సీట్లను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
1. బెల్లంపల్లె – గడ్డం వినోద్
2. మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
3. నిర్మల్ -కూచాడి శ్రీహరి రావు
4. ఆర్మూర్- ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
5. బోధన్ -పి. సుదర్శన్ రెడ్డి
6. బాల్కొండ- సునీల్ కుమార్ ముత్యాల
7. జగిత్యాల -టి. జీవన్ రెడ్డి
8. ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
9. రామగుండం ఎం.ఎస్. రాజ్ ఠాకూర్
10. మంథని- దుద్దిళ్ల శ్రీధర్ బాబు
11. పెద్దపల్లి- చింతకుంట విజయ రమణారావు
12. వేములవాడ- ఆది శ్రీనివాస్
13. మానకొండూర్ – డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
14. మెదక్- మైనంపల్లి రోహిత్ రావు
15. ఆందోల్ – సి. దామోదర రాజనర్సింహ
16. జహీరాబాద్ – ఆగం చంద్ర శేఖర్
17. సంగారెడ్డి- తురుపు జగ్గారెడ్డి
18. గజ్వేల్- తూంకుంట నర్సా రెడ్డి
19. మేడ్చల్- తోటకూరు వజ్రేష్ యాదవ్
20. మల్కాజిగిరి- మైనపల్లి హనుమంత రావు
21. కుత్బుల్లాపూర్- కొలన్ హన్మంత్ రెడ్డి
22. ఉప్పల్- ఎం. పరమేశ్వర్ రెడ్డి
23. చేవెళ్ల – పామెన భీం భారత్
24. పరిగి టి.రామ్మోహన్ రెడ్డి
25. వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
26. ముషీరాబాద్- అంజన్ కుమార్ యాదవ్
27. మలక్ పేట- షేక్ అక్బర్
28. సనత్‌నగర్- డా. కోట నీలం
29. నాంపల్లి- మహ్మద్ ఫిరోజ్ ఖాన్
30. కారవాన్- ఒస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రీ
31. గోషామహల్- మొగిలి సునీత
32. చాంద్రాయణగుట్ట – బోయ నగేష్ (నరేష్)
33. యాకుత్‌పురా- కె రవి రాజు
34. బహదూర్ పురా -రాజేష్ కుమార్ పులిపాటి
35. సికింద్రాబాద్- ఆడమ్ సంతోష్ కుమార్
36. కొడంగల్- అనుముల రేవంత్ రెడ్డి
37. గద్వాల్ -సరితా తిరుపతయ్య
38. అలంపూర్ – S.A. సంపత్ కుమార్
39. నాగర్ కర్నూల్ – డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి
40. అచ్చంపేట – డాక్టర్ సికుడు వంశీకృష్ణ
41. కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ రెడ్డి
42. షాద్‌నగర్- కె. శంకరయ్య
43. కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు
44. నాగార్జున సాగర్- జయవీర్ కుందూరు
45. హుజూర్నగర్- నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
46. కోదాడ – నలమాడ పద్మావతి రెడ్డి
47. నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
48. నకిరేకల్ – వేముల వీరేశం
49. ఆలేరు – బిర్లా ఐలయ్య
50. ఘన్పూర్ (స్టేషన్) – సింగపూర్ ఇందిర
51. నర్సంపేట- దొంతి మాధవ రెడ్డి
52. భూపాలపల్లె- గండ్ర సత్యనారాయణరావు
53. ములుగు సీతక్క
54. మధిర – భట్టి విక్రమార్క మల్లు
55. భద్రాచలం- పొడెం వీరయ్య
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!