NTV Telugu Site icon

N.V.S.S. Prabhakar: మిషన్ కాకతీయ హైదరాబాద్ లో ఏమైంది..?

N.v.s.s. Prabhakar

N.v.s.s. Prabhakar

మిషన్ కాకతీయ హైదరాబాద్ లో ఏమైంది? ప్రశ్నించారు బిజెపి నేత Nvss ప్రభాకర్. భారీ వర్షాలతో నగరంలో భారీ నష్టం జరిగిందని మండిపడ్డారు. పలు కాలనీలు నీట మునిగాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర పురపాలక మంత్రులుగా కెసిఆర్, కేటీఆర్ లే పని చేశారని గుర్తు చేసారు. హైదరాబాద్ దుస్థితికి కారణం తండ్రి కొడుకులే.. వారే నైతిక బాధ్యత వహించాలని మండిపడ్డారు. చెరువుల ఆక్రమణ వల్లే ఈ సమస్య ఏర్పడిందని నిప్పులుచెరిగారు. కమిషన్ ల కోసం తండ్రి కొడుకులు కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. 111 జీఓ ఎత్తెస్తమని అన్నారు.. ఇప్పుడు వస్తున్న వరద ఎక్కడి నుండి వస్తుంది? అని ప్రశ్నించారు.

read also: Andhra Pradesh Liquor Licence: ఏపీకి బార్‌ల అప్లికేషన్ల ద్వారా భారీ ఆదాయం!

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీశారని విమర్శించారు. క్యాసినో కేసును ఈడి వచ్చి విచారణ చేయాల్సిన పరిస్థితి.. ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం ఏమి చేస్తుందని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, ఆందోళన లు ఎవరి కోసం అంటూ మండిపడ్డారు. ఇది రాజకీయ కేసు కాదు.. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరుగుతోందని గుర్తు చేసారు. తల్లి కొడుకులు బెయిల్ మీద ఉన్నారు, వీరికి రాజ్యంగ సంస్థల పై నమ్మకం లేదని బిజెపి నేత Nvss ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Andhra Pradesh Liquor Licence: ఏపీకి బార్‌ల అప్లికేషన్ల ద్వారా భారీ ఆదాయం!