HYD: నేడు వనమహోత్సవం -2025 కార్యక్రమం. ప్రొ.జయశంకర్ వర్సిటీ ప్రాంగణంలో మొక్కను నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,000,18 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,600 లుగా ఉంది. అలాగే కిలో వెండిధర రూ. లుగా ఉంది. 1,11,100
తిరుపతి: నేడు ఇందిరా మైదానంలో బీసీల ఆత్మ గౌరవ సభ. హాజరుకానున్న రాష్ట్ర బిసి మంత్రులు అనగాని సత్యప్రసాద్, సబిత, సత్య కుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర సహా జాతీయ రాష్ట్ర బీసీ నాయకులు.ఇతర కుల సంఘాల నేతలు. మధ్యాహ్నం బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే విగ్రహం నుండి ఇందిరా మైదానం ర్యాలీ.
నంద్యాల : శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 1,71,208 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : 67,399 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు. ప్రస్తుతం : 878.40 అడుగులు. పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు. ప్రస్తుతం : 179.8995 టీఎంసీలు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
కర్నూలు: సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం. ఇన్ ఫ్లో:72,000 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో :61,931 క్యూసెక్కులు. 17 గేట్ల ఎత్తివేత. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు. ప్రస్తుత నీటిమట్టం. 0.4 టీఎంసీలు.
నెల్లూరు : ఇవాళ్టి నుంచి ఐదు రోజులు పాటు బారా షహిద్ దర్గాలో రొట్టెల పండుగ. భక్తుల భద్రతే లక్ష్యంగా 1600 మందిని వినియోస్తున్న పోలీస్ శాఖ. అసాంఘిక కార్యకలపాలకు అడ్డుకట్ట వేసేలా దర్గాతో పాటు చుట్టు పక్కల 70 సీసీ కెమెరాలు ఏర్పాటు. చెన్నై, బెంగుళూరు, విజయవాడ, ఒంగోలు, తిరుపతి వంటి ప్రాంతాలకు 40 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న RTC. సాయంత్రం దర్గాకి రానున్న మంత్రి లోకేష్, ఇంచార్జి మంత్రి ఫరూక్.
మహబూబ్ నగర్ జిల్లా: జూరాలకు పోటెత్తుతున్న వరద. 12 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో :1,17,554 వేల క్యూ సెక్కులు. ఔట్ ఫ్లో : 1,19,035 వేల, క్యూ సెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం :1045 ఫీట్లు. ప్రస్తుత నీటిమట్టం :1041.470 ఫీట్లు. పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ: 7.535 టీఎంసీలు. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 10 యూనిట్లతో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల.
మంచిర్యాల: నేడు జిల్లా లో మంత్రి వివేక్ పర్యటన. చెన్నూరు నియోజకవర్గం లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి.
ఖమ్మం : నేడు జిల్లాలో మంత్రులు భట్ విక్రమార్క, పొంగులేటిల పర్యటనలు.
