Bhatti Vikramarka: ఉద్యోగ విరమణ చేసిన సోమేశ్ కుమార్ కి మళ్ళీ పదవి ఏంటి? అని, సోమేశ్ కుమార్ కి ఇచ్చిన ఆర్డర్ చూసి ఆశ్చర్యం వేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి ఎక్స్ రోడ్ పాదయాత్ర శిబిరం నుంచి భట్టి మాట్లాడుతూ.. సోమేశ్ కుమార్ కి ఇచ్చిన ఆర్డర్ చూసి ఆశ్చర్యం వేసిందని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి మళ్ళీ పదవి ఏంటి? అంటూ షాక్ కు గురయ్యానని అన్నారు. ఇక్కడ ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటి.? అని ప్రశ్నించారు. రాష్ట్రం వచ్చిందే ఉద్యోగాల కోసం అని అన్నారు. వెట్టి చాకిరి చేసుకునే వాళ్ళ భూములు కూడా లాక్కుంటుంది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కేటీఆర్.. హైద్రాబాద్ అభివృద్ధి చేయకపోగా ఓఆర్‌ఆర్ అమ్ముకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. సోమేశ్, అరవింద్, కలిసి అమ్ముకునే స్కిం ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు. ప్రజలకు ఉపయోగ పడే స్కింలు ఇవ్వాలి కానీ.. స్కామ్ లు చేసుకునే సలహాలు ఇస్తున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Bhatti vikramarka: ఓసారి యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లు.. తలసానికి భట్టి సవాల్
ఓఆర్‌ఆర్‌ని ముపై ఏండ్లు అమ్మకానికి పెడితే ఎలా ? అందిన కాడికి అమ్ముకోవడమే అంటూ ఆరోపణలు చేశారు. అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మందిని సలహాదారులుగా పెట్టుకుంటారు? అంటూ ప్రశ్నించారు. మేము పేదలకు ఇచ్చిన భూములు అన్నీ మీవే? ఈ ప్రభుత్వానికి ఏ హక్కు లేదన్నారు. మీ భూమి దగ్గర మీరు ఉండండి, ఆ భూముల్లో అరకలు కట్టండి.. ఎవడు అడ్డు వచ్చినా ఆగకండి అంటూ సూచించారు. ఆరు నెలలు కాపాడుకోండి.. ఆరు నెలల తరవాత ఇందిరమ్మ రాజ్యం వస్తోందని భట్టి అన్నారు. ధరణి సృష్టి కర్త ..స్కామ్ స్టార్ సోమేశ్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమేశ్ పై విచారణ జరిపించాలని..! విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరం అయితే రాష్ట్రపతిని కూడా కలుస్తామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా సమాచారం ప్రజలకు చేరవేయండి అని సూచించారు. రిటైర్డ్ అయిన వాళ్ళు గబ్బిలాల లెక్క పట్టుకుని వేలాడుతున్నారని అన్నారు. ఉద్యోగాలు లేని వాళ్ళను బతకనీయండి అని భట్టి తెలిపారు.
Sabitha Indra Reddy: ఫెయిలైతే సప్లిమెంటరీ ఉంది.. ఇంటర్ స్టూడెంట్లు చనిపోవడంతో బాధేసింది