Sabitha Indra Reddy: ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన పడొద్దని, సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు. ఇంటర్ రిజల్ట్స్ తర్వాత జరిగిన ఆత్మహత్య ఘటనలు భాద కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తొందరపడి వారి బంగారు భవిష్యత్తును దూరం చేసుకోవద్దని సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అంతటితో ఆగిపోలేదని ధైర్యం చెప్పారు. నిన్న ఇంటర్ రిజల్ట్స్ విడుదల అయ్యాయని, కానీ ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలిచివేసిందని తెలిపారు. దయచేసి విద్యార్థులు ఆవేదనకు లోను కాకూడదని తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ రాయాలని సూచించారు.
Read also: Telangana Temple: కవిత కొండగట్టుకు.. ఇంద్రకరణ్ రెడ్డి భద్రాదికి..
తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్‌సిఇఆర్‌టిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పది ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్‌సిఎస్‌సి బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు 86.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 3.85 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్ విద్యార్థులు 44.51 శాతం, బాలురు 43.06 శాతం, బాలికలు 47.73 శాతం ఉత్తీర్ణత సాధించారు.