Head Constable: హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ ను గణేష్ కుటుంబ సభ్యులు ప్రశ్నించి నందుకు వారిపై కారుతో ఢీ కొట్టిన ఘటన సంచలనంగా మారింది. కారుతో గుద్దడమే కాకుండా వారిని 200 కిలోమీటలర్లు ఈడ్చెకెళ్లాడు. దీంతో బాధితులకు తీవ్ర గాయాలుకావడంతో వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై గణేష్ కుటుంబ సభ్యులు ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఇళ్ళు అమ్ముకొని వెళ్ళిపోవాలన్న టార్గెట్ తో వారిపై దాడి చేస్తున్నారని కన్నీరుమున్నీరయ్యారు. ఫిర్యాదు చేయడానికి పోతే పోలీస్ స్టేషన్ బయట అక్కడి పోలీసులు సమక్షంలోనే తన భర్త గణేష్ తో పాటు తన కొడుకు పై దాడి చేశారని వాపోయారు. తన కొడుకును చంపడానికి ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇళ్ళు తగలబెడుతాము, మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని చంపడానికి ఇరువై మంది మీద పడ్డారని, తప్పించుకోవడానికి కారులో వెళ్ళామని అన్నారు. మమ్మల్ని వెళ్ళనీయకుండా కారుకు అడ్డుపడ్డారని, ప్రాణ భయంతోనే కారును అలాగే తీసుకెళ్ళామమని తెలిపారు. లేకపోతే మా ఇంట్లో ఒకరు ఈ రోజు ఉండేవాళ్ళు కాదని కన్నీరు పెట్టుకున్నారు. డిపార్ట్మెంట్ లో తన భర్త ఉన్నప్పటికి వారికి న్యాయం జరగడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. మాకు ప్రాణ హాని ఉంది, రక్షణ కల్పించండంటూ వేడుకున్నారు.
Read also: Nikhil : పురాణ ఫాంటసీ కథతో రాబోతున్న నిఖిల్…!!
ముచ్చింతల్ గ్రామానికి చెందిన ధార కృష్ణ, బాలమణి దంపతులపై అదే గ్రామానికి చెందిన కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులను దుర్భాషలాడుతూ గొడవకు దిగుతున్నాడు. ఈ క్రమంలో హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్, అతని కుమారుడు వంశీ.. తన పొలానికి వెళ్తున్న ధర కృష్ణ కుమారుడు పవన్ కుమార్‌తో అకారణంగా గొడవ పడ్డారు. పవన్ ను ఇష్టానుసారంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. పవన్ తల్లి బాలామణి, సోదరి రూప హెడ్ కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్.. బాలమణి, రూపపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలమణి బంధువు రాజుతోపాటు పలువురు గ్రామస్తులు వెళ్లి జ్ఞానేశ్వర్‌ను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన జ్ఞానేశ్వర్ తన కారును స్టార్ట్ చేసి అతి వేగంతో వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. కానిస్టేబుల్ జ్ణానేశ్వర్ కారుకు అడ్డుపడ్డ పవన్ బాబాయ్ పై కూడా కారును నడిపాడు. గ్రామస్థులు పరుగులు తీయగా, రాజు కారు బానెట్‌పై పడిపోయాడు. కనికరం లేకుండా దుర్మార్గంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ అతడిని 200 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని బెదిరించాడు. హెడ్ కానిస్టేబుల్ దాడిలో గాయపడిన పవన్, బాలమణి, రూప, రాజులను గ్రామస్తులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Nikhil : పురాణ ఫాంటసీ కథతో రాబోతున్న నిఖిల్…!!