Nikhil : పురాణ ఫాంటసీ కథతో రాబోతున్న నిఖిల్…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిఖిల్ సిద్ధార్థ్ మంచి స్పీడ్ మీద ఉన్నాడు.. ఈయన కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతుంది…నిఖిల్ కెరీర్ లో కార్తికేయ 2 సృష్టించిన సంచలనం అంతా ఇంత అయితే కాదు.. తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో గా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ కూడా మంచి సక్సెస్ సాదించింది. దీంతో ఈ కుర్ర హీరోతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు కూడా భారీగా పోటీ పడుతున్నారు.
నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”స్పై”. యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా చేస్తుంది… ఆ సినిమా ఇది జూన్ చివరిలో విడుదల కానుంది. ఇక ఇది విడుదల కు రెడీ చేస్తూనే నిఖిల్ మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే.. ఈ మధ్యే నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌస్’ పేరుతో రామ్ చరణ్ నిర్మాతగా వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై మొదటి సినిమాను గ్రాండ్ లెవల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా 1900 దశకంలో భారతదేశ చరిత్రలో జరిగిన కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం.. ఇదిలా ఉండగా ఈ యువ హీరో మరో సినిమాను కూడా ప్రకటించారు. ఇది ఆయన కెరీర్ లో 20వ సినిమా కాగా ఈ రోజు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కూడా రాబోతున్నట్టు సమాచారం.ఈ సినిమా యువ యోధుడిని వర్ణించే పురాణ ఫాంటసీ కథ అని తెలుస్తుంది..భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.రవి బసృర్ సంగీతం ను అందిస్తున్నారు. ఇలా ఈ యువ హీరో కంటెంట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు.
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!