వేసవి వేడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది. నిన్న తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు… మరింత బలపడి మరో మూడు రోజుల్లో రాష్టాన్ని పూర్తిగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు రాష్టంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రోజు ఈశాన్య, పశ్చిమ జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి.
రేపు ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ వుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. క్రింది స్థాయి గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి రాష్టం మీదకు వీస్తున్నాయి. రాగల మూడు రోజులు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు విస్తారంగా కురవడంతో పాటుగా ఉరుములు మెరుపులు ఈదురు గాలులు వీస్తాయి. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులు వీస్తాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్టం ఎల్లో అలెర్ట్ లో ఉందని అధికారులు తెలిపారు.
సోమవారం భారీవర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో చీకట్లు అలముకున్నాయి. పటన్ చెరు, లింగంపల్లి, మదీనాగూడ, మియాపూర్, కూకట్ పల్లి, కాప్రా, ఏ.ఎస్.రావు నగర్, హెచ్.బి.కాలనీ, చర్లపల్లి, దమ్మాయిగూడ, నాగారం, కీసర…పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు.
Revanth Reddy : ఉండవల్లిపై రేవంత్ రెడ్డి ఫైర్..