Site icon NTV Telugu

Harish Rao:15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు

Harish Rao

Harish Rao

15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదని మంత్రి హ‌రీష్ రావు మండి ప‌డ్డారు. సిద్దిపేట పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి హరీష్ రావు. అనంతరం జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత కానిస్టేబుల్ శిక్ష‌ణ పొందిన విద్యార్థుల‌కు పుస్త‌కాలు పంపిణీ చేశారు. విధ్యార్థులు ఆత్మ‌విశ్వ‌సంతో చదివి పేరు తెచ్చుకోవాల‌ని ఆకాంక్షించారు. విధ్యార్థుల భ‌విష్య‌త్ బాగుండాల‌ని మంచి ఉద్యోగం పొందాలని కోరుకుంటున్నానని హ‌రీష్ పేర్కొన్నారు.

అయితే.. బీసీ స్టడీ సర్కిల్ వచ్చాక ఇది 4వ బ్యాచ్ అని గుర్తు చేశారు. తొంభైఐదు శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు మంత్రి హ‌రీష్ రావు. రాబోయే రోజుల్లో 95 వేల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్ని నోటిఫికేషన్‌లు ఒక్కసారిగా ఇస్తే ఇబ్బందులు తలెత్తే అవ‌కాశం వుంద‌ని, కావున దశల వారిగా ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాల సంవత్సరంగా ఈ ఏడాది మారనుందని హ‌రీష్ రావ్ అన్నారు. వ‌చ్చే జూలైలో ఎంత మంది రిటైర్డ్ అయితే మళ్ళీ అంత మందికి జాబ్ నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అయితే.. కేంద్రం పరిధిలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మూడేళ్ల నుంచి కేంద్రం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మంత్రి హ‌రీష్ రావ్ విమర్శించారు. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే.. వారికి కంప్యూటర్ కోచింగ్ ఇప్పిస్తామ‌ని పేర్కొన్నారు. మొబైల్, సినిమాలు, టీవీలు వదిలి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాల‌ని కోరారు. క‌న్న త‌ల్లిదండ్రులు కోరికను, మీ గోల్‌కు చేరాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు.
Srilanka: శ్రీలంక ప్రజలపై మరో పిడుగు.. పెట్రోల్‌, డీజిల్ ధరలు భారీగా పెంపు

Exit mobile version