Maoist: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ లేఖలు రావడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ప్రజాప్రతినిధులకు గుర్తుతెలియని వ్యక్తులు హెచ్చరిక లేఖలు పంపారు. జగిత్యాల జిల్లాలోని ప్రజా ప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో రాసిన లేఖలు పోస్టులో వచ్చాయి. జిల్లాలోని బీర్‌పూర్ మండల సర్పంచ్‌లు, ఎంపీపీ, నరసింహుల పల్లి ఎంపీటీసీలతో పాటు పలువురు కీలక నేతలు మావోయిస్టుల పేరుతో మొత్తం 28 మందికి ఈ లేఖలు రాశారు. అయితే మండలంలో కొందరు నాయకులు అటవీ భూములను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజాకోర్టులో దండం పెట్టి చంపేస్తామని లేఖలో హెచ్చరించారు. లెటర్ హెడ్స్‌పై జగదల్‌పూర్ జిల్లా ఏరియా కమిటీ అని ముద్రించారు. ఈ లేఖలను గోదావరి బెల్ట్ ఏరియా మావోయిస్టు కార్యదర్శి మల్లికార్జున్‌కు పంపారు. అయితే రాజకీయ నాయకులతో పాటు మండలంలోని ఓ ప్రభుత్వ అధికారికి కూడా లేఖలు అందాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. అయితే.. చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో ఈ భీకర ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. మావోయిస్టు మృతి చెందిన ప్రదేశం నుంచి పోలీసులు ఎస్‌ఎల్‌ఆర్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, పోలీసులెవరూ గాయపడలేదు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారు. దీంతో వారిని పట్టుకునేందుకు గ్రేహౌండ్స్ బలగాలు నిత్యం కూంబింగ్ నిర్వహిస్తుంటాయి. కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇలాంటి సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు చనిపోతున్నారు. అలాగే, కొన్నిసార్లు పోలీసులు కూడా ఈ కాల్పుల్లో మరణిస్తారు.
KTR: నా కొడుకు టాలెంట్ చూసి షాక్ అయ్యా..